Health Benefits: మీ మెదడు మరింత చురుగ్గా పనిచేయాలంటే చేయాల్సిన పనులు

మనకు వయస్సు పెరిగేకొద్దీ మన మెదడు పనితీరు కూడా ప్రతి ఏడాది తగ్గుతూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల పరధ్యానానికి వెళ్తారని అంటున్నారు. మన ఆహార అలవాట్లు, జీవనశైలి కూడా మెదడు పనితీరు తగ్గేందుకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు.

New Update
Health Benefits: మీ మెదడు మరింత చురుగ్గా పనిచేయాలంటే చేయాల్సిన పనులు

సాధారణంగా మెదడు పుట్టిన మూడు సంవత్సరాల్లో 80 శాతం వరకు అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మన మెదడు కంప్లీట్‌గా అభివృద్ధి అయ్యేందుకు ఐదు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. ఏ పని చేయాలన్నా మనం భయపడుతూనే ఆలోచిస్తాం. రుచి, వాసన, రంగును గుర్తించాలంటే మెదడుతోనే సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి కారణంతో చాలా మంది జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు.

ఇది కూడా చదవండి: చిన్నారి లక్షిత కిడ్నాప్ కథ సుఖాంతం...పోలీసుల అదుపులో కిడ్నాపర్

చేస్తున్న..చేసే పనులన్నీ మర్చిపోతుంటారు. అలాగే నిద్రలేకపోవడం, తగిన వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా ఫోన్‌ వాడటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో జ్ఞాపకశక్తి విపరీతంగా తగ్గిపోతుంది. కొన్ని ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటే మెదడు పనితీరు మరింత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ ఎక్కువశాతం ఉంటుంది, మెగ్నీషియం, పోలేట్ అధికంగా ఉంటుంది. ఇవి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తాయి. అందుకే నిత్యం ఆకుకూరలతో భోజనం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కోడిగుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మన మెదడుకు లాభం చేకూరుస్తాయి. అంతేకాకుండా ఈ పచ్చసొనలో విటమిన్ బి12 మెగ్నీషియం, జింక్ సంవృద్ధిగా మనకు లభిస్తాయి.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది

అందుకే ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే మన జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. రోజుకు రెండుసార్లు కోడిగుడ్డు తింటే మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. పెరుగు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు పెరుగు తినాలని, దానితో పాటు చేపల్లో కూడా అయోడిన్‌ సెలీనియం కొవ్వులు ఉంటాయని, వీటి వల్ల మెదడుపనితీరు బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండుసార్లు చేపలు తింటే వాటిలో ఉండే ఒమేగా ఫ్యాటీ-3, ఫ్యాటీ యాసిడ్స్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌ తినడం వల్ల కూడా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా అల్జీమర్స్‌ వ్యాధి కూడా మన దరి చేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు