Bed Time Tips: బెడ్‌ టైమ్‌కు ముందు ఇవి చేయకండి.. నిద్రకు బద్ద శత్రువులు ఇవే!

బెడ్‌ టైమ్‌కు ముందు హెవీగా ఫుడ్‌ తినవద్దు. నైట్‌ టైమ్‌ లైట్‌ ఫుడ్‌ బెస్ట్. ఇక నిద్రకు ముందు స్క్రీన్‌ టైమ్‌ను పరిమితం చేయండి. కెఫిన్ కంటెంట్‌కు కూడా దూరంగా ఉండండి. కాఫీ, టీ లాంటివి నిద్రకు ముందు అసలు వద్దు. నిద్రకు ముందు అతిగా ఏ విషయం గురించి ఆలోచించవద్దు.

New Update
Bed Time Tips: బెడ్‌ టైమ్‌కు ముందు ఇవి చేయకండి.. నిద్రకు బద్ద శత్రువులు ఇవే!

మనిషికి నిద్ర(Sleep) చాలా అవసరం. నేటి కాలంలో చాలా మంది నిద్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సరైన టైమ్‌కి పడుకోవడంలేదు. ఒకవేళ పడుకున్నా తిన్న వెంటనే బెడ్‌ ఎక్కేస్తున్నారు. అలా ఎక్కకూడదు. కాసేపు అటు ఇటు తిరగాలి. అప్పుడు కొవ్వు పట్టకుండా ఉంటుంది. తిన్నది అరుగుతుంది. ఇంకొంతమంది లేట్‌గా పడుకొని మార్నింగ్‌ లేట్‌గా లేస్తుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. నైట్‌ స్లీప్‌ అన్నది ఆరోగ్యానికి మంచిది. మార్నింగ్ స్లీప్‌ డిస్టర్‌బెన్స్‌తో కూడుకొని ఉంటుంది. ఇక ఇవే కాదు నిద్రకు ముందు చేయకూడని పనులు ఇంకా కొన్ని అవేంటో తెలుసుకోండి.

నిద్రకు ముందు ఇవి చేయకండి:
నిద్రకు ముందు భారీ భోజనం అసలు చేయకూడదు. మీరు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనం తిన్నప్పుడు.. అది మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఇది అసౌకర్యం, అజీర్ణానికి దారితీస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతాయి. అంటే బాడీ ఓవర్‌ హీట్‌ అవుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగితే నిద్ర పట్టదు. ఇక కెఫీన్‌కు కూడా దూరంగా ఉండాలి. కెఫిన్ ఉన్న లిక్విడ్‌ తాగితే నిద్ర పట్టదు. ఇది స్లీప్‌ సైకిల్‌కి బద్ద శత్రువు. అందుకే నిద్రకు ముదు కాఫీ, 'టీ'కి దూరంగా ఉండండి.

స్క్రీన్ సమయం వద్దు:
స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. వీడియో గేమ్‌లు ఆడటం లేదా ఏదైనా వీడియో కంటెంట్‌ను చూడటం లాంటివి చేయవద్దు. ఇక తీవ్రమైన లేదా ఉద్వేగభరితమైన కార్యకలాపాలకు చెందిన హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంటే ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. దాని వల్ల మీ శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లదు. అప్పుడు నిద్ర పట్టదు. ఇక నిద్ర సమయంలో ఒత్తిడితో కూడిన ఆలోచనలు చేయవద్దు. ఒత్తిడితో కూడిన ఆలోచనలు కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. నిద్ర రాకుండా అంతరాయం కలిగిస్తాయి. అతిగా ఆలోచించడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది సమస్యలను కూడా సాల్వ్ చేయదు. నిద్రకు అవసరమైన మానసిక ప్రశాంతతను సాధించడం అన్నిటికంటే ముఖ్యం.

Also Read: కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం

WATCH:

Advertisment
తాజా కథనాలు