హిందూవులు ఎంతో పవిత్రంగా భావించే మాసంలో కార్తీక మాసం ప్రధానమైనది. ఈ మాసం లో పూజలు చేయడంతో పాటు దానాలు చేసిన మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో దానం చేయడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ కార్తీకంలో ఎవరి శక్తి కొద్ది వారు దానాలు చేస్తుంటారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కొన్ని దానాలు చేస్తే పాప పరిహారం అవ్వడంతో పాటు ఎంతో పుణ్యం కూడా వస్తుంది అని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో ఏరోజున ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం.
కార్తీక మాసంలో మొదటి రోజున నెయ్యి, బంగారం దానం చేస్తే చాలా మంచిది. అగ్ని దేవుణ్ణి పూజిస్తే తేజస్సు ప్రాప్తిస్తుంది.
రెండో రోజు కలువ పూలు, నూనె , ఉప్పు దానం చేస్తే మంచిది. బ్రహ్మ దేవుణ్ణి పూజిస్తే మనఃశాంతి లభిస్తుంది. మూడో రోజు ఉప్పు దానం చేస్తే చాలా మంచిది. అలాగే పార్వతి దేవి ని పూజిస్తే సౌభాగ్యం చేకూరుతుంది. నాలుగో రోజు నూనె, పెసర పప్పు దానం చేస్తే మంచిది. ఈ రోజును గణపతిని పూజిస్తే సద్బుద్ది, కార్యసిద్ది ప్రాప్తిస్తాయి.
ఐదో రోజు స్వయం పాకం, విసనకర్ర దానం చేస్తే మంచిది. ఆరోజు ఆదిశేషున్ని పూజిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరో రోజు చిమ్మిలి దానం చేస్తే చాలా మంచిది. ఆరో రోజు సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే మంచి సంతానం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఙాన లబ్ధి పొందుతారు. కార్తీక మాసంలో ఏడో రోజు పట్టుబట్టలు, గోధుమలు, బంగారం దానం చేసి సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయి.
అలాగే ఎనిమిదో రోజు యథాశక్తి ఏదైనా దానం చేస్తే మంచిది. అలాగే దుర్గా దేవిని కొలిస్తే మంచి ధైర్యం విజయం ప్రాప్తిస్తాయి. తొమ్మిదో రోజు ఎనిమిది రకాల వస్తువులను దానం చేస్తే మంచిది. పితృదేవతలని పూజించడం పితృతర్పణాలు వదిలితే సంతానరక్షణ కలుగుతుంది.
పదో రోజు గుమ్మడి కాయ, స్వయం పాకం, నూనె దానం చేస్తే మంచిది. అష్టదిగ్గజాలను పూజిస్తే యశస్సు ధనప్రాప్తి కలుగుతాయి.పదకొండు రోజు విభూధిపండ్లు, దక్షిణతో సహ దానం ఇస్తే మంచిది. శివున్ని పూజిస్తే ధనప్రాప్తి, ఉన్నత పదవి లభిస్తాయి. పన్నెండో రోజు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి దానం చేయాలి.
పదమూడో రోజు మల్లెపూలు, జాజిపూలు దానం చేయాలి. పద్నాలుగో రోజు నువ్వులు, ఇనుము పాలిచ్చే గేదెను దానం చేయాలి.పదిహేనో రోజు అన్నం, భోజనం, వెండి దానం చేయాలి. పదహారో రోజు నెయ్యి, సమిథలు, దక్షిణ బంగారం దానం చేస్తే మంచిది. పదిహేడో రోజు ఔషధాలు, ధనం దానం చేసత్ఏ మంచిది. అశ్వని దేవతల్ని పూజిస్తే సర్వ వ్యాధులు తొలగి స్వస్థత వస్తుంది.
పద్దెనిమిదో రోజు పులిహోర, అట్లు, బెల్లం దానం చేస్తే మంచిది. పందొమ్మిదో రోజు కుడుములు దానం ఇవ్వాలి.ఇరవైయ్యో రోజు గోవు, భూమి, బంగారం దానం చేయాలి. ఇరవై ఒకటో రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజించి యథాశక్తి దానం చేయాలి. ఇరవై రెండో రోజు పట్టుబట్టలు, సువర్ణం, గోధుమలు దానం చేయాలి.
ఇరవై మూడో రోజు మంగళద్రవ్యాలు దానం ఇస్తే చాలా మంచిది. ఇరవ నాలుగో రోజు ఎర్ర చీర జాకెట్టు, ఎర్ర గాజులు,ఎర్ర పూలు దానం చేస్తే మంచిది. ఇరవై ఐదో రోజు యథాశక్తి దానం ఇవ్వాలి. ఇరవై ఆరో రోజు వంటకు ఉపయోగించే సరుకులు దానం చేస్తే మంచిది. ఇరవై ఏడో రోజు ఉసిరికాయ, వెండి, బంగారం దానం ఇవ్వాలి.
ఇరవై ఎనిమిదో రోజు నువ్వులు, ఉసిరికాయ దానం ఇవ్వాలి. ఇరవై తొమ్మిదో రోజు శివలింగం, విభూది, బంగారం దానం ఇవ్వాలి. ముప్పైవ రోజు నువ్వులు, ఉసిరి దానం ఇస్తే ఆత్మ స్థైర్యం, కుటుంబ క్షేమం కలుగుతుంది.
Also read: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!