నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం.. ఎస్బీఐ ఏటీఎంలో చోరీ..ఎంత డబ్బును ఎత్తుకెళ్లారంటే..?

నల్గొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విశ్వ ప్రయత్నం చేసి.. డబ్బు తీసుకోని పరిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీకి మేనేజర్ వీరబాబు వివరాలు తెలిపారు. ఆటిపాముల ఏటీఎంలో సెంటర్‌లో రెండు ఏటీఎంలు ఉన్న దాదాపు 23 లక్షలు ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షలు క్యాష్ ఉన్నట్లుగా సమాచారం ఇచ్చారు.

New Update
నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..  ఎస్బీఐ ఏటీఎంలో చోరీ..ఎంత డబ్బును ఎత్తుకెళ్లారంటే..?

 డబ్బులు ఎత్తుకెళ్లారు

నల్లగొండ జిల్లా కట్టంగూరు (Kattanguru) మండలం ఐటిపాముల గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అయిటిపాములలో జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీయంలోని (sbi) నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. శనివారం అర్థరాత్రి ఎవరూలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ముసుగులతో వచ్చి ఏటీఎంలోకి చొరబడి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను కట్ చేశారు. తర్వాత అందులో ఉన్న 23 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఎస్బీఐ బ్యాంకు వారికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే బ్యాంకు మేనేజర్ వీరబాబు (Bank manager Veerababu)పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వరస ఘటనలు

ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాఘవరావు, క్లూస్ టీం (CI Raghavrao, Clues Team)సహాయంతో పలు ఆధారాలు సేకరిస్తోంది. సీసీటీవీ ఫుటేజీ (CCTV footage)ల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే విధంగా 8 నెలల క్రితం కేతేపల్లి ఏటీఎంలో కూడా చోరీ జరిగింది. ఆ చోరీ చేసినది, ఇప్పుడు ఏటీఎంలో చోరీ చేసినది ఒక్కటే గ్యాంగా అనేది పోలీసుల( police) దర్యాప్తులో తేలనుంది. ఏది ఏమైనప్పటికీ వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

గతంలో దొంగతనం

ఐదు రోజుల (జూలై 26) క్రితం ఒడిశాలోని బరంపురం అనే ప్రాంతం నుంచి ఓ ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్‌కు వెళ్తోడగా.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ వద్ద బస్సుఆగింది. బస్సులో ఉన్న ఓ వ్యక్తి టిఫిన్ చేసేందుకుని బస్సు దిగి ఆ హోటల్‌కు వెళ్లాడు. ఆ బస్సులో అతనికి సంబంధించిన రెండు బ్యాగులు ఉన్నాయి. అందులోని ఓ బ్యాగులో రూ.24 లక్షలు ఉండగా.. మరో బ్యాగులో రూ.4 లక్షలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఆ బస్సులోకి చొరబడ్డాడు. ఆ డబ్బులు ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. దీంతో ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలో కూడా నార్కట్‌పల్లి హోటల్ వద్ద ఇలానే రెండు, మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే వరస దొంగతనం జిల్లా వాసులు భయాదోళనకు గురి అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు