BRS Party : తెలంగాణ భవన్‌లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు లూటీ!

తెలంగాణ భవన్‌లో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తున్నారు. నిన్న తెలంగాణ భవన్‌లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి వచ్చిన భద్రాచలం MLA తెల్లం వెంకట రావు జేబు నుంచి రూ.12 వేలు ఖాజేశారు. అలాగే ఓ కార్యకర్త నుంచి రూ.42వేలు చోరీ చేశారు.

BRS Party : తెలంగాణ భవన్‌లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు  లూటీ!
New Update

Thief's In Telangana Bhavan : హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో దొంగలున్నారు. అవునండి బాబు.. మీరు విన్నది నిజమే. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ మరి కొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలను(Lok Sabha Elections) గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ALSO READ: వైసీపీ మూడో లిస్టు విడుదల.. వారికి టికెట్ కట్

ఈ నేపథ్యంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అధ్యక్షతన నిన్న (గురువారం) తెలంగాణ భవన్ లో మహబూబాబాద్(Mahabubabad) లోక్ సభ సెగ్మెంట్ నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.

ఎమ్మెల్యే జేబు నుంచి రూ.12వేలు చోరీ..

తెలంగాణ భవన్ లో దొంగలు తమ చేతు వాటం చూపించారు. ఓ ఎమ్మెల్యే జేబు నుంచి డబ్బులు కాజేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు జేబు నుంచి రూ.12 వేలు కొట్టేశారట. అంతే కాకుండా మరో కార్యకర్తకు చెందిన ఫోన్, ఇంకో కార్యకర్త నుంచి రూ.42 వేలను మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో కొట్టేశారు ఈ దొంగలు. సమావేశాల్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో నాయకులు వస్తుండటం, మధ్యాహ్న భోజన సమయంలో రద్దీ ఉండటంతో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

భద్రత పెంపు...

తెలంగాణ భవన్ లో దొంగలు పడుతున్నారు.. తమ దగ్గరి నుంచి డబ్బులు, వస్తువులు కాజేస్తున్నారని ఫిర్యాదులు రావడం తో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు (శుక్రవారం) నుంచి తెలంగాణ భవన్ వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. అనుమతి లేనివారిని లోపలికి నో ఎంట్రీ అని తెలిపింది. ఎంట్రీ పాసులు ఉంటునే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపింది.

ALSO READ: కేసీఆర్ టార్గెట్ మేమే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

#thiefs-in-telangana-bhavan #telangana-bhavan #telangana-latest-news #mla-money-stolen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe