కావాలనే నా బిడ్డను వాడుకుంటున్నారు: ముత్తిరెడ్డి ఎమోషనల్‌

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమోషనల్‌తో మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ గోడవలో నా బిడ్డని కావాలనే వాడుకుంటున్నారని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నీతిగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డని అల్లుడిని అడ్డం పెట్టుకోవడం మంచిది కాదంటూ విమర్శలు చేశారు. నా బిడ్డ ఆ స్థలాన్ని ప్రజలకు దానం ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తాను... అయితే కూతురు హైకోర్టును ఆశ్రయించిన విషయంలో మరోసారి భావోద్వేగానికి ముత్తిరెడ్డి గురయ్యారు.

New Update
కావాలనే నా బిడ్డను వాడుకుంటున్నారు: ముత్తిరెడ్డి ఎమోషనల్‌

They are using my child at will: Muthireddy is emotional

భావోద్వేగానికి ముత్తిరెడ్డి

అమాయకురాలైన నా బిడ్డను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన కూతురుపై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి. జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్‌లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్‌గా ప్రారంభమైన కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.

నీతిగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి

అమాయకురాలైన నా బంగారు తల్లి నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మం.. కష్టం చేసుకుని జీవిస్తున్న అమాయకురాలైన నా బిడ్డను మూర్ఖులు దౌర్భాగ్యులు రోడ్డు పాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సమాజానికి మంచిది కాదు, వారికి అరిష్టం కలుగుతుందని నీతిగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప, నా బిడ్డను వాడుకొని, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదని విమర్శలు చేశారు.

ప్రజలకు స్థలాన్ని దానం ఇవ్వడం స్వాగతిస్తాను

రాజ్యాంగ బద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని.. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని పేర్కొందని, కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడుపై వేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని దేవుడు క్షమించడు…ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాసేవ చేయాలి కాబట్టి నేను ప్రజాసేవలోనే ఉంటానన్నారు. నా బిడ్డ ప్రజలకు స్థలాన్ని దానం ఇవ్వడం స్వాగతిస్తున్నానని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు