Free Current : ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..స్పష్టం చేసిన కేంద్రం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామంటూ ప్రకటించారు. అయితే స్కీమ్ పొందాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అవేంటో తెలియాలంటే...ఈ ఆర్టికల్ మీద ఓ లుక్కేసేయండి. By Manogna alamuru 05 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి 300 Units Free Current : కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రవేశ పెట్టిన 300 యూనిట్ల ఉచిత కరెంట్ మీద అప్డేట్ ఇచ్చింది. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన(PMSY) అనే పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ కింద ప్రభుత్వం సబ్సీడీ ఇవ్వడమే కాక ఇళ్ళ మీద సోలార్ ప్యానెళ్ళ(Solar Panels) ను ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తోంది. దాని ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current) ను ఇస్తామని చెబుతోంది. ఈ పథకం ద్వారా కోటి ఇళ్ళకు సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం సబ్సీడీ(Subsidy) ఇవ్వనుంది. దీని కోసం మొత్తం 7,327 కోట్లు కేటాయించింది. Also Read : Telangana : మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ దుర్గారావు అరెస్ట్ మూడు కండీషన్లను పెట్టిన ప్రభుత్వం... అయితే ఇళ్ళ మీద సోలార్ ప్యానెళ్ళను పెట్టుకోవాలంటే కొన్ని పనులు చేయాలి. కేంద్రం వీటిని ఉచితంగా ఏర్పాటు చేయదు. ఇవి కావాలనుకునే వారు solarrooftop.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. దాని తర్వాత దరఖాస్తుదారులకు కేంద్రం అనుమతినిస్తుంది. అప్పుడు తమ సొంత ఖర్చుతోనే పోలార్ ప్యానెళ్ళను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత కేంద్రం వారికి సబ్సీడీ ఇస్తుంది. దీనికి కూడా మళ్ళీ మూడు కండీషన్లు పెట్టింది. అప్లికేషన్ పెట్టుకున్నవారు తమకు సొంతంగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కలిగివుండాలి. అలాగే.. ప్రస్తుతం ఆ ఇంటికి వస్తున్న కరెంటు బిల్లు.. దరఖాస్తుదారు పేరున ఉండాలి. అలాగే దరఖాస్తుదారు పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ మూడూ ఉన్నవారికి మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తూ.. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఎంత సబ్సీడీ ఇస్తుంది? దీని మీద కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 3kw వరకూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేవారికి 1kwకి రూ.18000 చొప్పున ఇస్తఉంది గవర్నమెంట్. అంటే 2kw వేయించుకుంటే రూ.36,000 ...అదే 3kw సోలార్ ప్యానెల్స్ వేయించుకుంటే రూ.51,000 ఇస్తుంది. అంతకు మించి వేయించుకునే ప్రతీ 1kwకీ కేంద్రం రూ.9,000 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఇచ్చేయదు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్న దాదాపు నెల తర్వాత ఇస్తుంది. ఈ పథకం కోసం solarrooftop.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. అందులో వివరాలన్నీ పొందుపరిస్తే వాటిని పరిశీలించి పర్మిషన్ ఇస్తుంది. దీనికి 15 నుంచి 20 రోజులు టైమ్ పడుతుంది. Also Read : నా అరెస్టు వెనకున్న ప్రమేయం అదే.. హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు #budget #300-uints-free-current #solar-panels #pmsy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి