పిల్లలు వివిధ రకాల స్నాక్స్, బేకరీ ఐటెమ్స్, జంక్ ఫుడ్‌ను చాలా ఇష్టపడతారు. ఒక ఐస్‌క్రీమ్ లేదా చాక్లెట్ కొనిస్తే చాలు చాలా దగ్గరవుతారు. అయితే జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ చక్కెర, కొవ్వులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలకు ఎక్కువ జంక్ ఫుడ్ ఇస్తే, వారి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కడుపు సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నారులు రెగ్యులర్‌గా తినే 8 పాపులర్ జంక్‌ఫుడ్స్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..
* బంగాళాదుంప చిప్స్ (Potato Chips)
చిప్స్ ఎక్కువగా తినే పిల్లలకు ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి, ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
* ఇన్‌స్టంట్ నూడుల్స్
వీటిని చాలా త్వరగా వండుకోవచ్చు. కానీ ఈ నూడుల్స్‌లో ఉప్పు (సోడియం) శాతం ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్మాదం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
* పిజ్జాలు
పిజ్జాలలో చీజ్, సాస్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే చాలా ఎక్కువ కేలరీలు శరీరంలో పేరుకుపోతాయి. వీటిలో సోడియం, చక్కెర (పిండిలో, కొన్ని టాపింగ్స్‌లో) కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి వల్ల జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు.