Fruits Uplift Mood: చిరాకు వెంటనే పోవాలంటే ఈ పండ్లు తినండి..వెంటనే ఫలితం

కొన్నిసార్లు ఒత్తిడి, హార్మోన్ల, ఆందోళన, టెన్షన్‌ వంటి కారణాల వల్ల చాలామందికి మూడ్‌ మారుతుంది. అందు కోసం సరైనా ఆహారం, రోజూవారి వ్యాయామంతోపాటు ఆరెంజ్, నిమ్మకాయ, పైనాపిల్‌ వంటి పండ్లు తింటే మానసిక స్థితి మెరుగుపడి..ఎనర్జిటిక్‌గా ఉంటారు.

New Update
Fruits Uplift Mood: చిరాకు వెంటనే పోవాలంటే ఈ పండ్లు తినండి..వెంటనే ఫలితం

Fruits uplift Mood:ప్రస్తుతం ఉన్న జీవితంలో చిరాకు అనేవి అందరిలో ఉండే సాధారణ విషయం. ఒత్తిడి, హార్మోన్ల, ఆందోళన, టెన్షన్‌ వంటి కారణాల వల్ల చాలామందికి మూడ్‌ మారుతుంది. కొన్ని సార్లు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మన తప్పు లేనప్పుడు ఎవరైనా మనల్ని మాట అంటే మనకు తెలియకుండానే కోపం వస్తుంది. ఇలా చేసేవారి కొన్ని సార్లు ఫ్రెడ్స్‌, ఇష్టమైన వారిని, తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు. అయితే.. ఇలాంటి సమస్యలను దూరం కాలంటే మానసిక స్థితిని మెరుగుపరచుకోవాలంటున్నారు నిపుణులు. అందు కోసం సరైనా ఆహారం, రోజూవారి వ్యాయామం కచ్చితంగా చేయాలంటున్నారు. ఇలా చేస్తే చిరాక్‌ను దూరం చేయవచ్చట. మూడ్‌ సరి చేయడానికి కొన్ని పండ్లు కూడా ఉన్నయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈ పండ్లు తీసుకోవటం వలన కలగే ప్రయోజనాలు

ఆరెంజ్ (Oranges)
మూడ్‌ని మెరుగు పరచటంలో ఆరెంజ్‌ బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మూడ్‌ బాగలేనప్పుడు.. ఆరెంజ్ తింటే వెంటనే సెట్‌ అవుతుంది. ఈ పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అంతేకాదు సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్‌ మిటర్‌ల సంశ్లేషణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతీ రోజూ ఓ కమలపండు తింటే మానసిక స్థితి మెరుగుపడి..ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
నిమ్మ (Lemon)
నిమ్మకాయంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మలోని విటమిన్లు, వాటర్‌ కంటెంట్‌ మానసిక స్థితిని పెంచుతుంది. ఓ వ్యక్తిని పునరుజ్జీవింపజేయడంలో ఈ సిట్రస్ ఫ్రూట్ బెస్ట్‌. మనస్సు సరిగ్గాలేనప్పుడు.. నిమ్మరసం నీళ్లలో కొద్దిగా పుదీనా వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పైనాపిల్‌ (Pineapple)
మానసిక స్థితిని మెరుగుపరచటంలో పైనాపిల్‌ ఒకటి. ఈ పండులో బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు సెరోటోనిన్‌ స్థాయిలను మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మూడ్‌ బాలేనప్పుడు హ్యాపీగా కూర్చుని పైనాపిల్‌ ముక్కలు తింతే ఆ సమస్య నుంచి దూరం అవుతారు.

ఇది కూడా చదవండి: వారానికి మూడు రోజులు స్నానం చేస్తే సరిపోతుందా? నిపుణుల షాకింగ్‌ కామెంట్స్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు