ఫ్రిడ్జ్...ఇప్పుడు ఇది లేని ఇల్లు ఉండదు. దాదాపు అన్ని పదార్ధాలను ఇందులో పెట్టుకుంటాం. మనం వండుకున్నవో లేదా..కూరగాయలో..ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిందే. అయితే ఫ్రిడ్జ్ లో కొన్ని పదార్ధాలు అస్సలు పెట్టకూడదు. అవేంటో మీకు తెలుసా.
బ్రెడ్...
అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడని వస్తువుల్లో మొట్టమొదట ఉండేది బ్రెడ్. ఎలాంటి బ్రెడ్ అయినా దాన్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు. బ్రెడ్ ఫ్రిడ్జ్ లో పెడితే ఆరిపోయినట్టు అయిపోతుంది. అందులో ఉండే స్టార్చ్ విచ్ఛిన్నమయిపోతుంది. అందుకే బ్రెడ్ ను ఎప్పుడూ ఫ్రిడ్జిలో పెట్టకూడదు.
Also Read:రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!
వంటనూనెలు..
వెజిటేబుల్, ఆలివ్, కొబ్బరి, ఇతర వంట నూనెలను ఫ్రిడ్ిలో పెట్టకూడదు. అవి కనుక అందులో పెడితే గట్టి పడిపోతాయి. నూనెలే కాదు తెనె కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. గట్టిపడిపోతే అవి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలా టైమ్ పడుతుంది.
వెల్లుల్లి..
చల్లని ఉష్ణోగ్రతలు కూడా వెల్లుల్లిని మృదువుగా చేస్తాయి. వెల్లుల్లి రుచిని మారిపోతుంది. కాబట్టి, వీటిని కూడా ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. దీని వల్ల ఇబ్బందిగా మారుతుంది.
తులసి, రోజ్‌మేరీ, థైమ్ వాటి రుచిని నాశనం చేసి వాటిని పొడిగా చేస్తాయి. కాబట్టి, వీటిని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు.
టమాట..
టమాటల్ని కూడా ఫ్రిజ్‌లో పెడితే వాటి రుచి, ఆకృతి పాడైపోతుంది. కాబట్టి, వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బయటే వాటిని స్టోర్ చేయొచ్చు.
ఉల్లిపాయలు..
ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడం మంచిది. ఇందులోని తేమ కారణంగా ఉల్లిపాయలు మెత్తగా మారతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉల్లిపాయ కట్ చేసి అస్సలు పెట్టకూడదు. కట్ చేసిన ఉల్లిపాయను నిల్వ అస్సలు ఉంచకూడదు. అలా నిల్వ ఉన్న ఉల్లిపాయ తింటే కాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బంగాళాదుంపలు..
బంగాళాదుంపలని కూడా మిగతా కూరగాయల్లా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీని వల్ల అందులోని పిండి పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి.దీంతో చక్కెర కంటెంట్ పెరిగి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది.
కాఫీ..
కాఫీ స్టోర్ చేసే విధానంపై కూడా దాని రుచి ఆధారపడి ఉంటుంది. అందుకే, దీనిని ఫ్రిజ్‌లో పెట్టకుండా బయటే వెలుగు రాని చోట ఓ కంటెయినర్‌లో పెట్టడం మంచిది. దీని వల్ల దాని రుచి, తాజాదనం పోకుండా ఉంటుంది.
అరటిపండ్లు..
అరటిపండ్లని ఎప్పటికీ అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అందులో పెట్టడం వల్ల రుచి కోల్పోయి నిర్జీవంగా మారతాయి. అందుకే వాటిని రూమ్ టెంపరేచర్‌లోనే ఉంచాలి.