Nara Lokesh : లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏపీ సీఐడీ.. అడుగుతున్న క్వశ్చన్స్ లిస్ట్ ఇదే!

టీడీపీ మాజీ మంత్రి నారాలోకేశ్ ను తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10గంటలకు విచారణ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇద్దరు సభ్యుల సిఐడి బృందం విచారిస్తోంది. సీఐడి అదనపు ఎస్పీ జయరామరాజు, డీఎస్పీ భాస్కర్ లోకేశ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఐడీ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదంతా మీకు తెలిసే జరిగిందా...ముందే సమాచారం ఉందా...డిజైన్ లో ఎందుకు మార్పులు చేశారనే ప్రశ్నలతో లోకేశ్ ను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు.

Nara Lokesh : లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏపీ సీఐడీ.. అడుగుతున్న క్వశ్చన్స్ లిస్ట్ ఇదే!
New Update

టీడీపీ మాజీ మంత్రి నారాలోకేశ్ ను తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10గంటలకు విచారణ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇద్దరు సభ్యుల సిఐడి బృందం విచారిస్తోంది. సీఐడి అదనపు ఎస్పీ జయరామరాజు, డీఎస్పీ భాస్కర్ లోకేశ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఐడీ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదంతా మీకు తెలిసే జరిగిందా...ముందే సమాచారం ఉందా...డిజైన్ లో ఎందుకు మార్పులు చేశారనే ప్రశ్నలతో లోకేశ్ ను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు.

అయితే లోకేశ్ మాత్రం మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ డిజైన్ లో మార్పులు చేసినట్లు చెప్పినట్లు తెలిసింది. అసలు లోకేశ్ ను సీఐడీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతోంది. చూద్దాం.

ఇది కూడా చదవండి: నోరు జారిన రాహుల్..సెటైర్ వేసిన బీజేపీ..అసలేం జరిగిందంటే..!!

నారా లోకేష్ కు సీఐడీ ప్రశ్నలు:

1. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ సమాచారం మీకు ముందే ఎలా తెలుసు?
2. చంద్రబాబు నుంచే రింగ్ రోడ్డు సమాచారం మీకు తెలిసిందా?
3. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో మార్పులు ఎందుకు చేశారు?
4. IRR డిజైన్‌ను 3సార్లు మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా?
5. మంగళగిరి, తాడేపల్లి,తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొన్నారు?
6.హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు?
7.హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొంది?
8. 2014జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా?
9. కంతేరులో హెరిటేజ్‌ ఫుడ్స్‌కి 10.4 ఎకరాలు ఎప్పుడు కొన్నారు?
10. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో మీ వాటా ఎంత?
11. తప్పు చేయకపోతే హెరిటేజ్‌ వివరాలు చూపించడానికి ఇబ్బందేంటి?
12. లింగమనేని రమేష్‌కు, మీకు లింకేంటి?
13. లింగమనేని భూముల పక్క నుండే IRR వెళ్లడానికి కారణమేంటి?
14. లింగమనేనికి భూములు కట్టబెట్టినందుకే కరకట్ట ఇల్లును మీకు ఇచ్చారా?
15. రింగ్‌ రోడ్డు డిజైన్‌లో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఏంటి?
16. టీడీపీ నేతల భూముల రేట్లు పెంచుకునేందుకే IRRలో మార్పులు చేశారా?

ఇది కూడా చదవండి: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!

#nara-lokesh #ap-cid #amaravathi-inner-ring-road-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe