Year Ender 2023 : ఈ ఏడాది ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయిన డైట్ ప్లాన్స్ ఇవే... లిస్టు ఇదే.!!

2023 సంవత్సరంలో, కొన్ని డైట్ ప్లాన్‌లు వార్తల్లో నిలిచాయి.ఈ డైట్ ప్లాన్స్ ను ఎక్కువ మంది ఫాలో అయ్యారు. అనేక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఈ డైట్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో మెడిటరేనియన్ డైట్ మొదటిస్థానంలో నిలిచింది.

New Update
Year Ender 2023 : ఈ ఏడాది ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయిన డైట్ ప్లాన్స్ ఇవే... లిస్టు ఇదే.!!

Diet Plans : బరువు తగ్గడం అనేది పెద్దపని. వ్యాయామాలు, తినే ఆహారంలో మార్పులు చేస్తుంటారు. ఈ సందర్భంలో డైటింగ్ అనేది ఎప్పుడూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అయితే మునుపటి రోజులతో పోల్చితే ఈ ఏడాది డైటింగ్ లో కొన్ని డైట్ల పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ ఏడాది ట్రెండింగ్ డైటింగ్ మోడళ్లుగా నిలిచిన డైట్లో ఏవో ఇప్పుడు చూద్దాం.

1. మెడిటేరియన్ డైట్ :
2023లో ఎక్కువగా వినిపించిన డైట్ మెడిటేరియన్ డైట్. మొక్కల ఆధారిత ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఈ డైటింగ్(Diet Plans) చేస్తుంటారు. నట్స్, ఆలివ్ ఆయిల్, చేపలు, చీజ్, రెడ్ మీట్ వంటివి ఇందులో తినే ఆహారాలు. ఈ డైటింగ్ పేరు ఈ ఏడాదంతా ఆన్ లైన్లో చక్కర్లు కొట్టింది. చాలా మంది డైటీషియన్లు దీనిపై వీడియోలు కూడా చేశారు. రెసిపీలను తయారు చేశారు. బరువు తగ్గడం, గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకుంటారు.

2. ఇంటర్మిటెన్‌ పాస్టింగ్‌ డైట్‌ :
2023లో ఎక్కువ మంది ఈ డైట్ ను ఫాలో అయ్యారు. అరోగ్యకరమైన కొవ్వుల్ని ప్రధానంగా చేసుకుని ఈ డైటింగ్ చేస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నప్పటికీ ఈ ఏడాది ఎక్కువగా చర్చలు నడిచాయి. ఆచరించేవారు వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ లాంటి ప్రముఖలు కూడా ఈ డైట్ పాటించారు. దీని మీద క్రేజ్ చాలా మందిలో పెరిగింది. ఈ డైట్ లోఉన్నవారు దాదాపు 10 గంటలు పాటు మాత్రమే తినడానికి వీలుంటుంది. రోజులు 14 గంటల సమయం ఏమీ తినకుండా ఉండాలి.

3. కీటో డైట్
కీటో డైట్‌లో, తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెడుతుంది. కీటో డైట్‌ను 1 వారానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని వారాల్లో దాని ద్వారా వేగవంతమైన బరువు తగ్గడాన్ని సాధించవచ్చు. కాబట్టి, మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ డైట్‌ని ఎంచుకోవాలి, ఎందుకంటే దీన్ని చాలా కాలం పాటు అనుసరించడం వల్ల మీరు బలహీనపడవచ్చు.బరువు తగ్గాలనుకునేవారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు ఈ డైట్ ను పాటిస్తుంటారు.

4. వేగన్ డైట్ :
జంతువులు, పర్యావరణానికి తమ వల్ల ఎక్కువ దుష్ప్రభావాలు కలగకూడదనే శాంతియుతమైన ఆలోచనలు ఉన్నవారు ఎక్కువగా వేగన్ లుగా మారడం మనం చూస్తుంటాం. వీరు మాంసాలు, జంతు సంబంధమైన పదార్థాలు వేటినీ ముట్టుకోరు. కేవలం మొక్కల ఆధారంగా వచ్చే వాటిని మాత్రమే తింటుంటారు. ఈ ఏడాది ఇలాంటి డైట్ చేసేవారి సంఖ్య కూడా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందు.. ఈ 5 అలవాట్లకు వీడ్కోలు చెప్పండి…!!

Advertisment
తాజా కథనాలు