Viral Fever: వైరల్‌ ఫీవర్‌ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే

ఈ వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు మామూలు జ్వరాల్లానే కనిపిస్తాయి. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూతో పాటు చాలా రకాల జ్వరాలు వస్తున్నాయి. కాకపోతే వికారం, శరీరం నొప్పులు మలబద్ధకం ఉంటే తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

New Update
Viral Fever: వైరల్‌ ఫీవర్‌ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే

Viral Fever: చాలా మందికి ఉన్నట్టుండి ఒక్కసారిగా వైరల్‌ ఫీవర్‌ వస్తుంటుంది. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూతో పాటు చాలా రకాల జ్వరాలు వస్తున్నాయి. ఈ వైరల్‌ ఫీవర్‌ లక్షణాలు మామూలు జ్వరాల్లానే కనిపిస్తాయి. కాకపోతే వికారం, శరీరం నొప్పులు, చర్మం పొడిబారడం, ఆకలి అనిపించకపోవడం, తలనొప్పి, వాంతులతో పాటు మలబద్ధకం కూడా ఉంటుంది. తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

publive-image

ఎక్కువగా ద్రవ పదార్థాలు, ఫ్రూట్స్‌ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జ్వరం నుంచి తొందరగా బయటపడతారు. వైరల్‌ ఫీవర్‌ ఉంటే ధనియాల కషాయం తాగాలి, దీని వల్ల జ్వరం, ఒళ్లు నొప్పులు తొందరగా తగ్గుతాయి. అరటీస్పూన్‌ చొప్పున తిప్ప తీగ రసం తాగినా ప్రయోజనం ఉంటుంది. అలాగే రోగ నిరోధకశక్తికూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా దొండ ఆకుల రసాన్ని నుదుటిపై పట్టీలా వేసుకుంటే జ్వరం పోతుంది.

publive-image

జీలకర్ర కషాయం తాగినా జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా సరైన విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే తొందరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ జ్వరం ఎంతకీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. మరీ అవసరం అయితే రక్త పరీక్ష చేయించుకుని అది ఏ జ్వరమో తెలుసుకుని తగిన మందులు కూడా వాడాలని అంటున్నారు. వీలైనంత వరకు బయట తిరగకుండా రెస్ట్‌ తీసుకోవాలి. నూనె వస్తువులు అస్సలు తీసుకోకూడదు, తేలికగా జీర్ణం అయ్యే మసాలాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం అస్సలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌కి బెస్ట్‌ రూట్‌..ఒక్కసారి ట్రై చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు