Sleep Loss: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే జరిగే పరిణామాలు ఇవే..!! జాగ్రత్త మనం ప్రశాంతమైన జీవితం గడపడానికి నిద్ర ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే అరోగ్యానికి మంచికాదని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలని సూచిస్తున్నారు. అంతకంటే తక్కువ నిద్రపోతే.. ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి sleeping less: మనిషికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ప్రతీరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఫోన్‌ల వాడకం, నైట్ షిఫ్టులు, పనులు, లైఫ్‌స్టైల్ మార్పులతో అందరూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని ప్రభావం రోజువారీ పనులు, ఆరోగ్యంపై ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో రోజుకు 7 గంటలు నిద్రపోకపోతే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేకపోతే వచ్చే సమస్యలు: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే అలసటగా, గజిబిజిగా మేల్కొంటారు. దీంతో రోజంతా అలసటగా ఉంటూ.. మీ రోజువారీ పనులలో అప్రమత్త, ఏకాగ్రత తగ్గుతోంది. సరైన విశ్రాంతి లేకపోతే మీ పనిలో ఉత్పాదకత తగ్గి ఆలోచించడంలో స్పష్టత ఉండదు. సమస్యలను పరిష్కరించడం, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మనం రాత్రి పూట నిద్రపోతున్నప్పుడు శరీరం రిపేర్ మోడ్‌లోకి వెళ్లి కణాలు రిపేర్ చేస్తోంది. దీంతో రిఫ్రెష్‌గా, రియాక్టివేట్ అవుతారు. అంతేకాకుండా అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి పెరగడానికి అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉండటానికి 7 గంటల అవసరం. రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పడుకోకుండా ఉంటే శరీరం అధికంగా కేలరీలను వినియోగించుకుంటుంది. దీంతో ఎక్కువ ఆహారం తిని అధిక బరువుకు దారి తీస్తుంది. 4 గంటల కంటే తక్కువగా నిద్రపోయినవారిలో 10శాతం కొవ్వులు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఇది కూడా చదవండి: రక్తం తక్కువగా ఉందా..? ఈ ఐరన్ ఫుడ్‌ని తింటే సమస్య దూరం ప్రశాంతమైన నిద్ర ఉంటేనే రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది. గాఢమైన నిద్ర పోయినప్పుడు శరీరం సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి వాపులు, ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతాయి. 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. దీంతో రోగనిరోధక రక్షణ బలహీనపడి జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్‌ల వంటి అనారోగ్యాలు వస్తాయి. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఏదో ఒక టైమ్‌లో, ఎలాగోలా నిద్రపోతున్నాంగా అనుకుంటే సమస్యలు వస్తాయి. దానికి ఒక ప్లానింగ్, పద్ధతి ఉంటుంది. మనిషికి కనీసం 8 గంటలు నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రిపూట సరైన సమయంలో నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది. శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలోని అవయవాలన్నీ యాక్టివ్‌గా పనిచేసి హార్మోన్లను నియంత్రిస్తుంటుంది. ఇందులో సంతానోత్పత్తికి కారణమయ్యే కీలకమైన ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, LH, FSH హార్మోన్లు ఉంటాయి. నిద్రలేమి వల్ల హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. దీంతో సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నిద్రసరిగా లేకపోతే మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయంటున్నారని వైద్యులు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి