Parents Tips: తల్లిదండ్రుల మాట వినకపోతే జరిగే పరిణామాలు ఇవే

తల్లిదండ్రుల మాట విని వాళ్లు చెప్పినట్టు చేస్తే జీవితం ఎంతో హ్యాపీగా ముందుకు సాగుతుంది. మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు విని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. లేకుంటే జీవితం ఒంటరి అవుతుంది. ఎవరూ మనతో చివరి వరకు ఉండరని గుర్తుంచుకోండి.

Parents Tips: తల్లిదండ్రుల మాట వినకపోతే జరిగే పరిణామాలు ఇవే
New Update

Parents Tips: ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసం సర్వస్వం ధారబోస్తారు. చిన్ననాటి నుంచి వారి ఆలనాపాలనతో పాటు విద్యాభ్యాసం, ఉన్నత చదువుల నుంచి ఉద్యోగం వచ్చి జీవితంలో సెటిల్‌ అయ్యేవరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. చివరికి పెళ్లి చేసి ఓ ఇంటికి పంపేవరకు కూడా విశ్రమించరు. అలా చేసినప్పుడే వాళ్ల పిల్లల పట్ల వారి బాధ్యత నెరవేరినట్లు అవుతుంది. అయితే.. ప్రస్తుత కాలంలో పిల్లలు తల్లిదండ్రులు మాట వినే పరిస్థితి లేదు. టెక్నాలజీ పెరిగాక పిల్లలు సొంత ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతీది స్వార్థపూరితం అయిపోయింది.అయితే.. ఎంత టెక్నాలజీ పెరిగినా..!! ఎన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నా..!! పెద్దవారి మాట వినకపోతే కొన్ని అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సొంత నిర్ణయాలు సక్సెస్‌ కాకపోవచ్చు:

ఇప్పటికిప్పుడు అర్థంకాకపోయినా ఎప్పుడో ఒకసారి మాత్రం తల్లిదండ్రుల మాట విని ఉంటే బాగుండేది అనే బాధ కలగక మానదు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఒక సమయానికి నా పిల్లలకి మంచి చేయాలనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ చెడిపోవాలని ఎప్పుడూ కోరుకోరు. పిల్లలు ఏదో సాధిస్తే వారికే ఉపయోగం కానీ తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ పిల్లలు మాత్రం పెరిగాక వారి స్వార్థం వారు చూసుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ రేపు ఏదైనా చిన్న తప్పు జరిగితే తల్లిదండ్రుల మాట విని ఉంటే బాగుండేదన్న భావన కలుగుతుంది. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఎలా ఉంటామో, ఎలా పోతామో ఎవరికీ తెలియదు. కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలకి మంచి చేయాలనే తపిస్తారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకోవద్దు. పరిస్థితుల కారణంగా కొన్ని పనులు, స్వయంగా తీసుకునే నిర్ణయాలు సక్సెస్‌ కాకపోవచ్చు. అప్పుడు మాత్రం తల్లిదండ్రులు గుర్తుకొస్తారు.

జీవితం ఒంటరిగా మారుతుంది:

అయ్యో నా తల్లి చెప్పిన మాట వినలేదే అనే బాధ మనల్ని ఎంతో ఆవేదనకు గురిచేస్తుంది. తప్పు తెలుసుకునేలోపు జీవితం ఒంటరిగా మారుతుంది. ఏం చేయాలో తెలియదు, ఎవరూ సపోర్ట్‌ చేయరు, నా అనుకున్నవాళ్లు కూడా అర్థం చేసుకోరు. అప్పుడు మన జీవితం ఇంకా నరకంగా అనిపిస్తుంది. అందుకే లైఫ్‌కి అంటూ ఒక గోల్‌ పెట్టుకోవాలి, దాన్ని నెరవేర్చుకునేందుకు పెద్దల సలహాలు తీసుకోవాలి, నలుగురి అభిప్రాయాల మేరకు ముందుకు సాగాలి, నా అనుకుని స్వార్థపూరితంగా ఆలోచిస్తే చివరికి నీవే మిగులుతావని గుర్తుంచుకో. అందుకే తల్లిదండ్రుల మాట విని వాళ్లు చెప్పినట్టు చేస్తే జీవితం ఎంతో హ్యాపీగా ముందుకు సాగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులను వదిలేసి వారి జీవితం వారు చూసుకుంటున్నారు. మనకి అందరికంటే.. అన్నిటికంటే ముఖ్యమైనది ఫస్ట్ తల్లిదండ్రులు, వారి తర్వాతనే ఏదైనా. మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు విని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. లేకుంటే జీవితం ఒంటరి అవుతుంది. ఎవరూ మనతో చివరి వరకు ఉండరని గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #parents-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe