NSC Scheme : మీరు డబ్బులు దాచుకోవాలనుకుంటే..అది కూడా వచ్చే ఐదేళ్ల కాలంలో మంచి రాబడి పొందాలని భావిస్తే...మీకోసం ఎన్నో బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్(Investment Plans) అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎన్ ఎస్ సీ స్కీమ్(NSC Scheme)నుంచి యులిప్స్ వరకు పలు రకాల ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా మీకు లభించే రాబడి మారతుందని గుర్తుంచుకోవాలి. ఈ క్వీటి లింక్డ్ సేవింగ్స్(Equity Linked Savings) స్కీమ్ ఉంది. ఇది స్వల్పకాలం నుంచి మధ్యస్థ కాలంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఇది చాలా పాపులర్ ఇన్వెస్ట్ మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ స్కీం. ఫండ్ మేనేజర్లు ఈ ఫండ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారు. మీ డబ్బును పలు అసెట్స్ లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కటె్లో లింక్ అయి ఉంటుంది. అందుకే రిస్క్ ఉంటుంది. కానీ రాబడి బాగుంటుంది.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెస్ ప్లాన్:
యూనిట్ లింక్డ్ ఇన్సూరెస్ ప్లాన్ ఉంది. వీటిని యులిప్స్ అని పిలుస్తారు. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్ మెంట్ రెండు రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సిస్టమ్యాటిక్ విత్ డ్రాయెల్ ఆప్షన్ కూడా ఉంది. అందుకే ఈ ప్లాన్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఉంది. ఈ స్కీం టెన్యూర్ ఐదు సంవత్సరాలు ఉంటుంది. దీనిలో డబ్బులు పెట్టుబడి పెడితే 7.7శాతం వడ్డిని పొందవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం వలే ఉంటుంది.
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్:
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఉంది. ఇది డెట్ ఆధారిత క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్(Mutual Fund). అంటే మీ డబ్బును డెట్ ఫండ్స్ లో పెడతారు. బ్యాంక్ ఎఫ్డీ కంటే మీకు అధిక రాబడి వస్తుంది. ఇక లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. వీటి మెచ్యూరిటీ కాలం 91 రోజులు. స్వల్ప కాలంలో హై లిక్విడిటీ ఆఫ్షన్ కోరుకునే వాళ్లు వీటిల్లో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్ తో లింక్ అయి ఈ ఫండ్స్ రిటర్స్ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చిన పెట్టుబడి ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని పెట్టుబడి పెట్టవచ్చు.
ఇది కూడా చదవండి: మెడిక్లెయిమ్ గుడ్ న్యూస్.. హాస్పిటల్ లో చేరకపోయినా క్లెయిమ్ ఓకే!