Akshara foundation: ఆ స్కూల్‌లో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. ఉచితంగానే పాఠాలు.. అయితే ఓ కండీషన్ ప్రస్తుతం పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేరిపించాలంటే లక్షలకు లక్షలు ఫీజులు కట్టాల్సిందే. చాలీచాలని జీతాలతో పిల్లల ఫీజు కట్టాలంటే తలకు మించిన భారం అవుతుంది. అయితే ఓ స్కూల్‌లో మాత్రం ఫీజులు లేకుండానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అలా చెప్పడం వల్ల యాజమాన్యానికి ఆదాయం ఎలా వస్తుంది అనుకుంటున్నారా..? పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పాలంటే వారు పెట్టిన కండీషన్ ఏంటి..? దాని వెనక ఉన్న లక్ష్యం ఏంటి..?ఇప్పుడు తెలుసుకుందాం. By BalaMurali Krishna 18 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Akshara foundation: ప్రస్తుతం పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేరిపించాలంటే లక్షలకు లక్షలు ఫీజులు కట్టాల్సిందే. చాలీచాలని జీతాలతో పిల్లల ఫీజు కట్టాలంటే తలకు మించిన భారం అవుతుంది. అయితే ఓ స్కూల్‌లో మాత్రం ఫీజులు లేకుండానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అలా చెప్పడం వల్ల యాజమాన్యానికి ఆదాయం ఎలా వస్తుంది అనుకుంటున్నారా..? పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పాలంటే వారు పెట్టిన కండీషన్ ఏంటి..? దాని వెనక ఉన్న లక్ష్యం ఏంటి..?ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం రాజధాని దిస్పూర్‌కు చెందిన పర్మితా శర్మ, మాజిన్ ముక్తర్ కలిసి ది అక్షర్ స్కూల్‌ను 2016లో ప్రారంభించారు. అయితే వీరు ఈ పాఠశాల ప్రారంభించడం వెనక సమాజానికి ఉపయోగపడే పెద్ద లక్ష్యమే ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వేస్టేజ్, నిరక్షరాస్యత సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ రెండు సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టే విధంగా ఈ స్కూల్ నెలకొల్పారు. ఈ స్కూలులో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఫీజుకు బదులు వారానికి 25 ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావాలనే నిబంధన పెట్టారు. దీంతో స్థానికులు ప్లాస్టిక్ బాటిళ్లను రోడ్డుపై పడేయకుండా పిల్లలకు ఇచ్చి స్కూల్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే అక్కడ ప్లాస్టిక్ వేస్టేజ్ సమస్యతో పాటు నిరక్షరాస్యత కూడా చాలా వరకు తీరినట్లు వెల్లడించారు. అయితే ఇలా పిల్లలు తీసుకువచ్చిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వాహకులు రీసైక్లింగ్ చేయడం ప్రారంభించారు. View this post on Instagram A post shared by Akshar Foundation (@akshar_foundation) అంతేకాకుండా ఇక ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులతో పాటు చదువుతున్న విద్యార్థులు.. చిన్న తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ నిర్ణయంతో వారు చదువుకోవడమే కాకుండా ఆదాయం కూడా అర్జిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులకు సమాజంలో ఎలా మెదులుకోవాలి, పెద్దవారితో ఎలా నడుచుకోవాలి, ప్లాస్టిక్ రీసైక్లింగ్, కార్పెంటరీ పనులు, గార్డెనింగ్ వంటి పనులను నేర్పిస్తున్నారు. దీంతో ఇక్కడి స్కూల్‌లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న నేటి కాలంలో ఇలా సమాజ హితం కోసం ఆలోచించి ఉచితంగా పాఠాలు చెప్పడం అభినందనమీయని స్కూల్ నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: భగత్‌సింగ్, నెహ్రు నుంచి మోదీ వరకు.. పాత పార్లమెంట్ భవనం చరిత్ర ఇదే..! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి