Virat Kohli: విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా అతను ప్రపంచంలోని ఏ జట్టులోనైనా స్థానం సంపాదించగలంత ఫిట్ గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ పై వస్తున్న వార్తలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup) విరాట్ కోహ్లీ ఆడే అవకాశం లేదని అంటున్నారు. అతనికి జట్టులో చోటు లభించకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్ 30న జరిగిన బిసిసిఐ సెలక్టర్ల సమావేశంలో కూడా దీనిపై చర్చించారని, ఇందులో రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ టీ20ల్లో (T20) విరాట్ కోహ్లీ భవితవ్యంపై చర్చించినట్లు తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ(Virat Kohli) దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు. ఈ కారణంగానే సౌతాఫ్రికా టూర్ లో టీ20, వన్డే సిరీస్ లలో అతడి పేరు లేదు. కానీ, ఇప్పుడు మీడియా కథనాల ప్రకారం అతను 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు కష్టం.
Also Read: టుక్ టుక్ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!
ఎందుకిలా?
ఎందుకిలా జరిగిందనేది ఇప్పుడు ప్రశ్న. భారత కొత్త ఓపెనింగ్ జోడీగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ను బీసీసీఐ సెట్ చేసుకొవాలని అనుకుంటోందని చెబుతున్నారు. దీని కారణంగానే టీ20 వరల్డ్ కప్ కోసం కోహ్లీని పరిగణనలోకి తీసుకునే ఆలోచన క్రికెట్ బోర్డు చేయడం లేదని చెబుతున్నారు.
కోహ్లీకి లేని చోటు.. రోహిత్ కు కెప్టెన్సీ
అయితే అదే జట్టు పగ్గాలు 36 ఏళ్ల రోహిత్ శర్మకు ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందనీ..అయితే, విరాట్ కోహ్లీ (Virat Kohli) కి చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అందులో తప్పేమీ లేదు. కెప్టెన్సీలో రోహిత్ తనను తాను నిరూపించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఆడలేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే అనిపిస్తోంది. దీనికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే..
అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ దే పైచేయి
పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ(Virat Kohli) నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 138. అంతే కాదు, అతను 38 కి పైగా హాఫ్ సెంచరీలు చేశాడు. కాబట్టి మిగిలిన ఆటగాళ్లతో అతన్ని పోల్చి చూస్తే, అతను చాలా ముందు వరుసలో కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆడే అవకాశం లేదు అని వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Watch this interesting Video: