IPL 2024: రూ. 25 కోట్లు పెట్టి కొంటే నట్టేట ముంచాడు! ఐపీఎల్ సీజన్ లో కొందరు ఆటగాళ్లు అక్కడ హీరోలు.. ఐపీఎల్లో మాత్రం జీరోలు అనే పరిస్థితి ఏర్పడింది. కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే కనీసం లక్షల్లో కొన్న ఆటగాడి ప్రదర్శన కూడా వాళ్లు చేయటం లేదు. అయితే కోల్ కత్తా జట్టు కు చెందిన ఓ ఆటగాడి పరిస్థితి అలానే ఉంది! By Durga Rao 17 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్ల ప్రదర్శనలపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేకేఆర్ ఫ్రాంచైజీ, ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మిచెల్ స్టార్క్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. స్టార్స్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 16న మంగళవారం రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మ్యాచ్‌లో కూడా స్టార్క్ తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో పర్ఫార్మెన్స్ చూస్తే చాలు ఈ సీజన్లో స్టార్క్ స్ట్రగుల్ అవుతున్నాడని అర్థమవుతుంది. నాలుగు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకుని, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. మొత్తంమీద ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో, స్టార్క్ 46.40 బౌలింగ్ యావరేజ్‌తో, 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.స్టార్క్ ఫామ్‌లో లేడు, అతని పదునులేని బౌలింగ్ కారణంగానే మంగళవారం మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై చేయి సాధించిందని చెప్పవచ్చు. స్టార్క్ లెగ్-సైడ్ వైడ్ వేసి కీలకమైన ఐదు పరుగులు సమర్పించడం, రాజస్థాన్‌కి కలిసొచ్చింది. జోస్ బట్లర్ అద్భుతమైన సెంచరీ (107*)తో చెలరేగంతో కేకేఆర్‌కి ఓటమి తప్పలేదు. స్టార్క్ బౌలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. KKR బౌలింగ్ ఎటాక్‌లో స్టార్క్ వీక్ లింక్‌గా కనిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. భారీ ధర అందుకుని లీగ్‌లోకి అడుగుపెట్టిన స్టార్క్ ప్రదర్శన కేకేఆర్‌కి మేలు చేకూర్చడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి.కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం ఆడిన 6 మ్యాచ్‌లలో 4 గెలిచింది. కేవలం రెండు మాత్రమే ఓడిపోయింది. రానున్న కీలక మ్యాచ్‌లలో కేకేఆర్ తప్పక గెలవాలంటే, స్టార్క్ లయ అందుకోవాలి. కోల్‌కతా టైటిల్ గెలవాలంటే స్టార్క్ ప్రదర్శన కీలకం. కీలక మ్యాచ్‌లలో స్టార్స్ ఫామ్ అందుకుని చెలరేగితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌కి తిరుగుండదని ఫ్యాన్స్, క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మిచెల్ స్టార్క్ చాలా కాలం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ 2014, 2015 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అప్పటి నుంచి విశ్రాంతి, పనిభారం, గాయాల కారణంగా ఐపీఎల్‌కి దూరమయ్యాడు. ఐపీఎల్ 17 సీజన్‌కి వేలంలో అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్లో స్టార్స్ ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లలో 39 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2015 ఎడిషన్‌లో RCB తరఫున 20 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. #kkr #mitchell-starc #ipl-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి