బీజేపీలో టీడీపీ నాయకులే ఎక్కువ..వారి వల్లే పార్టీకి నష్టం పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక వస్తుందని నందమూరి లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి నియామకం కావడంపై నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు. స్వతంత్రంగా ఎదగ గలననే ఆలోచనలతో పురంధేశ్వరి నియామకం జరిగితే టీడీపీలో చీలిక వస్తుందన్నారు. ఇక ఏపీలో మూడు పార్టీలు కలిసి వెళితే బీజేపీకే నష్టం వాటిల్లుతుందని ఆమె చెప్పారు. By Vijaya Nimma 06 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి ఇప్పటికైన మంచి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విషయంపై నందమూరి లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు అసలైన బీజేపీ మనిషి అని, కానీ వారికి బీజేపీ పార్టీలో అన్యాయం జరిగిందంటూ...ఆర్టీవీతో జరిగిన సంభాషణలో నందమూరి లక్ష్మీ పార్వతిపై వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరిని ప్రకటించడం మంచిదని, ఆ నిర్ణయం బీజేపీ బలోపేతానికి దోహదపడుతుందని చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులందరూ పురంధరేశ్వరి ఉండడం వల్ల బీజేపీపై మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. టీడీపీ- బీజేపీ కలిస్తే ఇప్పుడు బీజేపీ తీసుకున్న నిర్ణయం వృధా అయ్యే అవకాశాలున్నాయన్నారు. అంతేకాకుండా బీజేపీలో చాలామంది టీడీపీ నాయకులే ఉన్నారనీ, వారి వల్లనే బీజేపీ నష్టపోతుందని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తే పార్టీలో కొంత చీలక వస్తుంది, ఎన్టీఆర్‌కు భారతరత్న చేసింది కూడా అలాంటి వాళ్లే అంటూ నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. బీజేపీకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీని తిరస్కరించే వాళ్ళు పురంధేశ్వరి వల్ల..బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు నందమూరి లక్ష్మీ పార్వతి. చంద్రబాబు కంటే ప్రభావవంతంగా పురంధేశ్వరి వ్యవహరిస్తారని నేను అనుకోవడం లేదని కూడా తెలిపారు. బీజేపీ వాళ్ళు దేశ ముదుర్లని పేర్కొన్నారను. బీజేపీ పార్టీతో సాన్నిహిత్యం కోసం పావురాలు, కాకులతోను చంద్రబాబు సందేశాలు పంపి… చివరకు అమిత్ షాను కలవగలిగారని లక్ష్మీ పార్వతి చురకలు అంటించారు. బీజేపీ, టీడీపీ కలిస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టేనంటూ వ్యాఖ్యానించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి