/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/There-are-many-health-benefits-of-eating-vamu-leaves-jpg.webp)
Health: వాము ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వంటింట్లో మనకు తెలియకుండా ఎన్నో రకాల ఔషధాలున్నాయి. అందులో ఒకటే వాము. ఈ వాము తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. వాము ఆకులను తిన్నా అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ఈ ఆకులను తింటే రక్తహీనత తగ్గుతుంది. వాము ఆకుల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాము ఆకులతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రక్తహీనత చెక్..
- వాము ఆకులను నేరుగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా శరీరంలో ఐరన్ శాతం పెగుతుంది. రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారికి ఈ ఆకుల ఎంతో మేలు చేస్తాయి.
నొప్పి నుంచి ఉపశమనం..
- మహిళలందరూకి నెలసరి టైంలో కడుపు నొప్పి, నడుము నొప్పి ఉంటుంది. అలాంటి వారు వాము ఆకులను తింటే నెలసరి నొప్పి నుంచి రిలీఫ్ దొరుగుతుంది.
నోటి దుర్వాసన పరార్
- కొందరూ మాట్లాడేటప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు వాము ఆకుల్ని తింటే నోటి దుర్వాసన పోతుంది. వాము ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దుర్వాసనను పోగొడతాయి.
జీర్ణ సమస్యలు..
- జీర్ణ సమస్యలతో కొందరూ బాధపడుతూంటారు. అలాంటి వారు వాము ఆకులని తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ యాసిడ్ గుణాలు కడుపు నుంచి అదనపు ఆమ్లాన్ని తగ్గిస్తుంది.
కిడ్నీ రాళ్ళు..
- కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే వాము ఆకులని తినడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులని తేనె, వెనిగర్‌తో కలిపి తింటేశరీరానికి కావలసిన ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచుతుంది.
కఫం దూరం..
- ముఖ్యంగా చలికాలం, వర్షాకాలం సీజన్‌లో జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో వాము ఆకులని నమిలి తింటే జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడం..
- వాము ఆకుల్ని తింటే అధిక బరువు తగ్గుతారు. ఈ ఆకుల్లో ఉండే కేలరీలు, ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆకులని నమిలి తింటే ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది.
ఇది కూడా చదవండి: స్త్రీలకు అనాస పువ్వు ఓ వరం.. ఎన్నో రుగ్మతలు మాయం!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.