Singapore: 34 ఏళ్లకే అమ్మమ్మ అయిన మహిళ! ఆ మహిళ 34 ఏళ్లకే 'అమ్మమ్మ' అయింది. స్వయానా ఆమె తన ఇన్ స్టాగ్రమ్ ఖాతా ద్వారా తెలిపింది. కాని ఆమె చెప్పిన దానికి ఆమె ఫాలోవర్స్ ఆమెకు అభినందలు చెప్పాలో? సానుభూతి చూపించాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. By Durga Rao 02 Apr 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి ప్రపంచంలో సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే ఇలాంటి సంఘటనలు ఎన్నో వింటూనే ఉంటారు. కాని సింగపూర్ నుంచి ఇలాంటి వార్తే వచ్చిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ నివసిస్తున్న షిర్లీ అనే మహిళ తాను అమ్మమ్మ అయిన విషయాన్ని బహిరంగంగా పంచుకుంది. అయితే ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికి ఆ మహిళ చెప్పిన విషయాలు మాత్రం షాకింగ్‌కి గురిచేస్తున్నాయి. తల్లి, అమ్మమ్మ అవ్వడం అనేది ఏ స్త్రీకైనా సంతోషకరమైన విషయం. అయితే, సింగపూర్‌కు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమె 34 ఏళ్ల వయసులో అమ్మమ్మ అయిన వార్తను పంచుకోవడంతో, ప్రజలు కొంచెం గందరగోళానికి గురయ్యారు. ఇందుకు ఆ మహిళను అభినందించాలా లేక ఓదార్చాలా అని వారికి అర్థం కాలేదు. నిజానికి ఆ మహిళ కుమారుడికి ఇంకా 17 ఏళ్లు మాత్రమే. షిర్లీ సోషల్ మీడియాలో తన 17 ఏళ్ల కొడుకు తండ్రి అయ్యాడు.నేను అమ్మమ్మ అయినందున చాలా సంతోషంగా ఉంది. ఇటీవలె తమ కుటుంబం వేడుక చేసుకున్నట్లు తను తెలిపింది. సింగపూర్ లో షిర్లీ ఒక రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 17 వేలకు పైగా ఫాలోవర్లను ఉన్నారు. ప్రస్తుతం ఆమె కొడుకు చదువుకుంటున్నాడు. తన కొడుకు చేసిన పనికి తనను తిట్టడానికి బదులు సలహాలు ఇస్తున్నట్లు చెప్పింది. ఈ దశతో తన కొడుకు చేసిన పనికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి షిర్లీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో తన కొడుకుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె 5 మంది పిల్లలకు తల్లి. తన పిల్లలు ఇంత చిన్న వయస్సులో కుటుంబాన్ని ప్రారంభించాలని ఆమె కోరుకోలేదు, కానీ తన కొడుకుతో ఈ తప్పు జరిగిన తరువాత, ఆమె ఈ చర్య తీసుకోవలసి వచ్చింది. ఆమె పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ప్రజలు ఆమె విఫలమైన తల్లి అని, తన బిడ్డకు చిన్న వయస్సులోనే కుటుంబాన్ని ప్రారంభించమని సలహా ఇస్తున్నారని అన్నారు. అయితే, కొంతమంది ఆమె పట్ల సానుభూతి చూపారు. మరికొందరు ఆమె తన కుమారుడికి సరైన మార్గదర్శకత్వం వహిస్తోందని తెలిపారు. #viral-news #weird-news #awesome-awesome మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి