తారాస్థాయికి చేరుకున్న గాజా,ఇజ్రాయెల్ యుద్ధం!

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేయగా.. గత 4 రోజుల్లోనే గాజా నుంచి 1.8 లక్షల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు గాజాలో తాగునీరు దొరకక మురుగు నీరు తాగుతున్నారని..దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారని ఐరాస పేర్కొంది.

తారాస్థాయికి చేరుకున్న గాజా,ఇజ్రాయెల్ యుద్ధం!
New Update

పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ 2007 నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉంది. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, హమాస్ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి చేసింది. 1500 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ఇజ్రాయెల్ చేస్తున్న ప్రస్తుత యుద్ధానికి ఇది ప్రారంభ స్థానం. హమాస్‌ను నాశనం చేయడమే తమ ప్రాథమిక లక్ష్యం అనే నినాదంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది.

యుద్ధంలో ఇప్పటివరకు 38వేల మందికి పైగా గాజన్లు మరణించారు. ఇది గాజన్ల మొత్తం జనాభాలో 1.7 శాతం. అదేవిధంగా 3.7% జనాభా అంటే 86వేల మంది ప్రజలు యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం కారణంగా 23 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఆకలి, అంటు వ్యాధులు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. గాజా స్ట్రిప్ దాదాపుగా నేలమట్టమైంది. యుద్ధం ప్రారంభమైన 269 రోజుల తర్వాత, ఇజ్రాయెల్ ఈ యుద్ధం యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చిందా? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి సమాధానమిచ్చారు.

“హమాస్ ఒక సిద్ధాంతం, హమాస్ ఒక పార్టీ, అది ప్రజల హృదయాల్లో పాతుకుపోయింది. "హమాస్‌ను నిర్మూలించవచ్చని అనుకోవడం పొరపాటు." యుద్ధం ప్రారంభమైన 8 నెలల తర్వాత ఇజ్రాయెల్ ఈ విషయాన్ని అంగీకరించింది. ఇజ్రాయెల్ హమాస్ సొరంగాలను, దాని అగ్ర యోధులను నాయకుడిని ధ్వంసం చేయాలని వారి వద్ద ఉన్న 240 మందికి పైగా బందీలను విడిపించాలని ప్రణాళిక వేసింది. అయితే 8 నెలల తర్వాత కూడా ఇజ్రాయెల్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

మరోవైపు గాజా తాగునీటి అవసరాలలో 90% తీరడం లేదు. అందువల్ల, ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గాజాలో, నివాస ప్రాంతం నుండి వచ్చే మురుగునీటిని పరీక్షించగా..పోలియో వైరస్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో దాదాపు 14వేల మందిని అక్కడి నుంచి తక్షణమే తరలించాలని ఐరాస తెలిపింది. కానీ దీని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అలాగే, గత 4 రోజుల్లోనే గాజాలోని ఖాన్ యూనిస్ నుండి 1.8 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

#israel-gaza-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe