పిల్లాడు తింటున్న ప్లేటును లాక్కెళ్లిన వెయిటర్.. చివరికి ఏం చేశాడంటే..? ఓ మహిళ తిని మిగిలించిన ఫుడ్ ను తీసుకుంటాడు ఓ బాలుడు. అయితే, పిల్లాడు తింటున్న ప్లేటును ఓ వెయిటర్ లాక్కెళ్లాడు. కాసేపటికే వేరేప్లేటులో మంచి ఆహారాన్ని తీసుకొస్తాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వెయిటర్ తన మంచి మనసు చాటుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. By Jyoshna Sappogula 05 Nov 2023 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి A kind waiter: ఓ చిన్న పిల్లాడికి బాగా ఆకలి వేసింది. అయితే, కడుపు నింపుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తుంటాడు. స్థానిక హోటల్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ తింటూ తింటూ మధ్యలో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఇది గమనించిన బాలుడు..వెంటనే మహిళ తిని వెళ్లిన ప్లేటులోని ఆహారాన్ని తీసుకుని తినబోతాడు. పిల్లాడిని గమనించిన హోటల్ వెయిటర్ బాలుడి చేతిలోని ప్లేటును లాక్కుంటాడు. దీంతో ఆ బాలుడు ఆకలితో ఏడుస్తూ కూర్చుంటాడు. ఇదంతా గమనిస్తున్న పక్కన ఉన్న వారంతా అయ్యో పాపం! అని జాలిపడ్డారు. The heroic waiter takes the leftover food from a small child and brings a new onepic.twitter.com/KVc2b9iEmn — Enezator (@Enezator) November 3, 2023 అయితే పిల్లాడి ప్లేటును తీసుకెళ్లిన వెయిటర్.. కాసేపటికి వేరే ప్లేటులో మంచి ఆహారాన్ని తీసుకొస్తాడు. టేబుల్‌పై ప్లేటు పెట్టగానే తినడానికి పిల్లాడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. దీంతో వెయిటర్ పిల్లాడిపై చేయి వేసి, హ్యాపీగా తిను అని చెప్పాడు. బాలుడు ఎంతో సంతోషించి ప్లేటులోని ఆహారాన్ని ఇష్టంగా తింటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా స్కిప్టెడ్ మాదిరి ఉందే’’.. అని కొందరు, ‘‘వెయిటర్ చాలా గ్రేట్’’.. అని మరికొందరు, ‘‘మనసుకు హత్తుకునే ఘటన’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మానవత్వమే కరువైన ఈ రోజుల్లో వెయిటర్ తన మంచి మనసు చాటుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Also Read: అద్దాన్ని చూసి ఉలిక్కిపడిన ఎలుగుబంటి..ఆదివారాల్లో నా రియాక్షన్ ఇంతే అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్.! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి