Times Now Survey : మూడోసారి పీఎం మోదీనే...రాహుల్‎ పరిస్థితి ఏంటి..?

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్ సూచించింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచే ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టస్తారని సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవ ప్రసంగంలో మోదీ...దేశంలో సాధించిన విజయాలే 2024లో మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సైతం మోదీ ఆహ్వానించారు.

New Update
Times Now Survey : మూడోసారి పీఎం మోదీనే...రాహుల్‎ పరిస్థితి ఏంటి..?

Times Now EGT Survey : టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియల్ పోల్ ప్రకారం బీజేపీ (BJP) 300సీట్లకు పైగా విజయం సాధిస్తుందని అంచనా వేయగా... విపక్షాల ఇండియా కూటమి 160-190 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఎన్డీఏ దాదాపు 296-326 సీట్లు సాధించవచ్చని సర్వే అంచనా వేసింది. 2019లో 353 సీట్లు సాధించినప్పటికీ ఈసారి మాత్రం స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రానున్న లోకసబ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడమే లక్ష్యంగా... ప్రతిపక్షాల పార్టీల ఐక్యత ఇండియా కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ..ఎన్డీఏ (NDA)ను ఎదుర్కొనేందుకు కూటమి ప్రయత్నాలన్నీ సరిపోకపోవచ్చని సూచించింది.

మోదీ మ్యాజిక్ కొనసాగింపు:
ఎన్డీఏ 80శాతం సక్సెస్ రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తుందని సర్వే వెల్లడించింది. ఉత్తరభారతదేశంలో మోదీ వేవ్ (Modi Wave) కొనసాగుతుందని నొక్కి చెప్పింది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ గణనీయమైన సీట్లను సాధిస్తుందని అంచనా. ఈ రాష్ట్రాల్లో 80సీట్లలో ఎన్డీఏ దాదాపు 70సీట్లు సాధిస్తుందని ఈటీజీ సర్వే పేర్కొంది. మొత్తం మీదుగా ఈ రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్ వర్కవౌట్ అవుతుందని సర్వేలో తేలింది.

మూడురాష్ట్రాల్లో ఇండియా పనితీరు భేష్:
దక్షిణరాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, కేరళలో ప్రతిపక్షాలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల మధ్య సయోధ్య లేకపోవడం వారి పనితీరుపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అంచనా వేసింది. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో మరోసారి ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.

తమిళనాడులో భారతకూటమి 30 -34 (57.2శాతం)సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా...ఎన్డీఏ 4-8(27.8శాతం)సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. కర్నాటకలో ఎన్డీఏ 18 నుంచి 20 (44.6శాతం) సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 8నుంచి 10 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉంది.

ఇక అటు మహారాష్ట్ర, బీహార్ లలో ఎన్డీఏకు భారత కూటమి గట్టిపోటీనిస్తుందని భావిస్తున్నారు. బీహార్ లో ఎన్డీఏ 22-24 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా..భారతకూటమి 16 నుంచి 18సీట్ల గెలుస్తుందని అంచనా వేసింది.

పశ్చిమబెంగాల్ లో టీఎంసీ స్వల్పతేడాతో విజయం సాధించే ఛాన్స్ ఉందని సర్వే సూచిస్తుంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)  ప్రభావం రాబోయే ఎన్నికల ఫలితాలపై అంతంతమాత్రమే ఉండే అవకాశం ఉందని సర్వే తేల్చి చెప్పింది. మొత్తమ్మీద మోదీ (Modi) మరోసారి ప్రధాని అవ్వడం ఖాయమని తేలిపోయింది. విక్షిత్ భారత్ మంత్రం...మోదీని మరోసారి ప్రధాని చేస్తుందని సర్వే అంచనా వేసింది.

Also Read: కేంద్రం కీలక నిర్ణయం…ఇక ప్రాంతీయ భాషల్లోనూ ప్రభుత్వ పరీక్షలు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు