Times Now Survey : మూడోసారి పీఎం మోదీనే...రాహుల్ పరిస్థితి ఏంటి..?
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్ సూచించింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచే ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టస్తారని సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవ ప్రసంగంలో మోదీ...దేశంలో సాధించిన విజయాలే 2024లో మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సైతం మోదీ ఆహ్వానించారు.