crime News: మాంసం కోసం కొట్టుకున్న ఇరు వర్గాలు..పది మందికి తీవ్రగాయాలు..! కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhoomi 12 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాంసం కోసం ఇరువర్గాల ఘర్షణపడ్డాయి. ఈ ఘటనలో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నందికొట్కూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. మరో ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్..భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? #kurnool #ugadi-festival #meat-fight మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి