Holiday: విద్యార్థులకు అలర్ట్...ఫిబ్రవరి 8న పాఠశాలలకు సెలవు..కారణం ఇదే..!

విద్యార్థులకు, ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఈనెల 8న సెలవు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 8న ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం
New Update

Holiday For Schools: తెలంగాణలోని విద్యార్థులకు, ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక. ఫిబ్రవరి 8న (February 8) ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఆరోజున ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవని సర్కార్ వెల్లడించింది. ఈ విషయాన్ని విద్యార్థులు, ఉద్యోగులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సాధారణంగా ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీని షబ్ ఎ మోరాజ్ కు సెలవు రోజుగా ప్రకటించింది. అయితే దీనిని ప్రస్తుతం సాధారణ సెలవుగా మార్చింది. షబ్ ఎ మెరాజ్ (Shab e Meraj) ముస్లింలకు పవిత్రమైన రోజు.

ఆరోజు పర్వానా మసీదులను దీపాలతో డెకరేట్ చేస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుదల కావడంతో ప్రభుత్వ ఆఫీసులు, పాఠాశాలలకు సెలవుగా మారింది. కాగా ఈ సెలవు తర్వాత ఫిబ్రవరిలో సాధారణ సెలవులేమీ లేవు. సాధారణ పండుగలు జనవరి తర్వాత మార్చిలోనే ఉంటాయి. సర్కార్ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రభుత్వ సెలవు ఉంది. మార్చిలోనే హోలీ పండగ ఉంది. మార్చి 29న గుడ్ ఫ్రైడే ఉంది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హాలీడే ప్రకటించారు.

ఇది కూడా చదవండి: మగాళ్లకూ మంచిరోజులు వచ్చేశాయ్..పురుషులకోసం ప్రత్యేక బస్సులు…కండీషన్స్ అప్లయ్..!!

ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కూడా ఉంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమికి కూడా సెలవు ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.

#telangana #schools-holiday #shab-e-meraj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe