/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-1-1-jpg.webp)
తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని రద్దు చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 54 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఈరోజు ( ఆదివారం) ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.