Telangana Cabinet: బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2024-25 తెలంగాణ బడ్జెట్ సుమారు రూ.2.97 లక్షల కోట్లు ఉండనున్నట్లు సమాచారం.

New Update
Telangana Cabinet: బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్

Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ సందర్బంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. 2024-25 తెలంగాణ బడ్జెట్ రూ.2.97 లక్షల కోట్లు ఉండనున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ తయారీ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా.. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు భారీగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు