కన్వర్ యాత్ర వివాదం..స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు!

కన్వర్ యాత్ర మార్గంలోని దుకాణాలపై పేర్లు రాయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. అంతకుముందు దుకాణాలపై పేర్లు తప్పనిసరి రాయాలని రాష్ట్ర ప్రభుత్వం దుకాణదారులను ఆదేశించింది. దీనిపై మైనార్టీలు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.  

New Update
కన్వర్ యాత్ర వివాదం..స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు!

శివ భక్తులు గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకొని ఊరేగింపుగా ఆలయాలకు పూజలు చేస్తారు. దీనిని 'కన్వర్' యాత్ర అని పిలుస్తారు. ఈ యాత్ర ఏటా ఉత్తరాఖండ్‌లోని యుపీలో జరుగుతుంది. యూపీలోని ముజఫర్‌పూర్ పోలీసులు 'కన్వర్ యాత్ర మార్గాల్లోని రెస్టారెంట్లు, టీ షాపుల పేర్లను నేమ్ బోర్డుపై ప్రదర్శించాలి' అని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. విపక్షాల నిరసనతో పోలీసులు ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.తదనంతరం, రాష్ట్రంలోని కన్వర్ యాత్ర మార్గాల్లోని రెస్టారెంట్లు,టీ షాపుల నేమ్ బోర్డులు తప్పనిసరిగా వాటి యజమాని పేరు  మొబైల్ ఫోన్ నంబర్‌ను కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

తమ పేర్లు రాయమని ప్రజలను కోరడం ద్వారా ప్రభుత్వం వారి పట్ల వివక్ష చూపుతుందని మైనారిటీలను ఆర్థికంగా ఒంటరి చేసే పని జరుగుతోందని యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో కన్వర్ యాత్ర మార్గంలోని దుకాణాల యజమానులు, ఉద్యోగుల పేర్లను తప్పనిసరిగా రాయాలని ఉత్తరప్రదేశ్ సహా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు