Amaravati: అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ

AP: అమరావతి రాజధాని పరిధిలో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. దీంతో అమరావతిలో ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు.

Amaravati: రాజధాని నిర్మాణాల సీఆర్‌డీఏ కీలక ఆదేశాలు
New Update

Gazette Notification Issued: అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు (Amaravati Govt Complex) నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనుంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసింది సీఆర్డీఏ. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జోనింగ్‌ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్‌ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నోటిఫై. లింగాయపాలె, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన చేశారు సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌.

Also Read: వైసీపీ కీలక నేతకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది

#chandrababu-naidu #amaravati
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe