టీడీపీకి షాక్..
కాగా, ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్య సభ స్థానాలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి షాకిచ్చేలా అధికార పార్టీ వైసీపీ పెద్ద ప్లాన్ వేసింది. రాజ్యసభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం తగ్గించేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే గంటా పదవి రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్ గా.. జగన్ విమర్శల బాణాలు!
న్యాయ పోరాటం..
స్పీకర్ సీతారం తాజా నిర్ణయంతో గంటా రాజ్య సభ్య ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోతారు. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గినట్టేనని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ నెల 22న రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా..రాబోయే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి గంటా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, గంటా రాజీనామా ఆమోదంపై హైకోర్టుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆమోదించడంపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్న తెలుస్తోంది.