AP Exit Polls: ఏంటిరా బాబూ మరీ ఇంత దారుణమా.. ఏపీ ఎగ్జిట్ పోల్స్ అంటూ తప్పుడు పోస్ట్స్.. నిజాలు ఇవే!

ఏపీ ఎన్నికల్లో గెలిచేది వీరే అంటూ ఈమధ్య సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ కథనాలు వెల్లువలా వస్తున్నాయి. అయితే, అవన్నీ ఫేక్ అని తేలింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో  ఇప్పటి వరకూ ఏ సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. కొన్ని తప్పుడు పోల్స్ ఈ ఆర్టికల్ లో చూడవచ్చు 

AP Exit Polls: ఏంటిరా బాబూ మరీ ఇంత దారుణమా.. ఏపీ ఎగ్జిట్ పోల్స్ అంటూ తప్పుడు పోస్ట్స్.. నిజాలు ఇవే!
New Update

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి వారం దాటింది. ఎన్నికల ఫలితాలు రావడానికి జూన్ 4వ తేదీ వరకూ సమయం ఉంది. ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి పార్టీలకు.. అభ్యర్థులకు, ప్రజలకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పేరుతో.. ఎన్నికల ఫలితాలు ఇలా ఉండవచ్చు.. అలా ఉండవచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పుడు బయట పెట్టకూడదని ఎన్నికల సంఘం కచ్చితంగా చెప్పింది. అయినా, సోషల్ మీడియాలో రకరకాల ఎగ్జిట్ పోల్స్(AP Exit Polls) దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా.. రకరకాల ఇబ్బందులను తెస్తున్నాయి. కొన్ని చోట్ల ఎగ్జిట్ పోల్స్ లో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నారని.. వేరే పార్టీ వారిపై దాడులు జరగడం. మరికొన్ని చోట్ల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కరెక్టా.. కాదా అనే వాదులాటలు ఘర్షణలకు దారితీయడం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కోట్లాది రూపాయల బెటింగ్స్ కూడా జోరుగా జారుతున్న పరిస్థితి చాల చోట్ల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ పత్రిక ది హిందూ ఒక ఫాక్ట్ చెక్ సమాచారం అందించింది. దాని ప్రకారం ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకం అని తేలింది. హిందూ వెల్లడించిన కొన్ని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియా పోస్ట్ లు ఇక్కడ ఉన్నాయి. 

Also Read: పార్టీల ఫోకస్ అంతా పిఠాపురం పైనే.. మంగళగిరిలో సైలెన్స్ దేనికి సంకేతం?

AP Exit Polls: NDA కంటే YSRCPని ముందంజలో ఉంచుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన 'PTI సర్వే'ని చూపుతామని ఒక పోస్ట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఫేక్.. 

publive-image

ఈ గ్రాఫిక్‌లోని అనేక స్పెల్లింగ్ తప్పులు దీనిని తప్పుడు పోస్ట్ గా చెబుతున్నాయి. అలాగే PTI కూడా అది నకిలీదని స్పష్టం చేసింది .

AP Exit Polls: మరో పోస్ట్ టెలివిజన్ ఛానెల్ టైమ్స్ నౌ ఇచ్చిన పోల్‌ అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి, 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఒపీనియన్ పోల్ కోసం ఛానెల్ ఉపయోగించిన ఇలాంటి టెంప్లేట్‌ని ది హిందూ పత్రిక కనుగొంది. ఈ  టెంప్లేట్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినదిగా కనిపించేలా డిజిటల్‌గా మార్చినట్టు కనిపిస్తోంది. 

AP Exit Polls: వైరల్ పోస్ట్‌లలో ఒకటి డిజిటల్ న్యూస్ పోర్టల్ ది న్యూస్ మినిట్ ద్వారా వచ్చిన గ్రాఫిక్‌గా కనిపిస్తుంది.  ఇందులో వివిధ సంస్థల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు ఉన్నాయి. అవన్నీ వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎన్‌డీఏ భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నాయని చూపిస్తున్నాయి.

ఈ గ్రాఫిక్ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచురించిన ఒక మానిప్యులేట్ వెర్షన్ అని ది హిందూ కనుగొంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ మే 19, 2019న ది న్యూస్ మినిట్ ప్రచురించిన అసలు కథనానికి సంబంధించినదిగా తేలింది. 

మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుతం ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పేరుతొ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్. ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి అనుమతించలేదు. అనుమతి లేకుండా ఒకవేళ నిజమైన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం కూడా నేరం. అటువంటిది ఫేక్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లను నమ్మవద్దు. వాటిని నమ్మి ఎటువంటి బెట్టింగ్స్ కానీ.. ఒకరితో ఒకరు ఘర్షణలు పడటం కానీ చేయకండి. మరోసారి చెబుతున్నాం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఫేక్...... ఇటువంటి వాటిని నమ్మి షేర్ చేయడం.. కామెంట్స్ చేయడం చేయకండి.

ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది.. ఆ సంస్థ చెబుతోంది.. బాబోయ్ ఇది ఫేక్ రా.. అని.. ఆ ట్వీట్ కూడా చూసేయండి..

#exit-polls #ap-elections-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe