Attack on Trump: ట్రంప్ పై దాడి ఘటనలో జరిగింది ఇదీ.. ప్రత్యక్షసాక్షి కథనం ఇదే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనలో సీక్రెట్ సర్వీస్ వైఫల్యం కనిపిస్తోందని చెబుతున్నారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం సీక్రెట్ సర్వీస్ కు ప్రత్యక్ష సాక్షి చెప్పినా దుండగుడిని పసిగట్టలేకపోయారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Attack on Trump: ట్రంప్ పై దాడి ఘటనలో జరిగింది ఇదీ.. ప్రత్యక్షసాక్షి కథనం ఇదే!

Attack on Trump: అమెరికాలోని పిన్సిన్వేలియాలో నిర్వహిస్తున్న ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కుడి చెవికి గాయం కావడంతో ఆయనను భద్రతా సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఇప్పుడు ట్రంప్ పై జరిగిన ఈ హత్యాయత్నంలో సీక్రెట్  సర్వీస్ వైఫల్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం సీక్రెట్ సర్వీస్ భద్రతపై ప్రశ్నలు వెలువడుతున్నాయి. BBC రిపోర్ట్  ప్రకారం, ర్యాలీలో ఉన్న గ్రెగ్ స్మిత్ అనే ప్రత్యక్ష సాక్షి మొత్తం సంఘటనను వివరించాడు.

జరిగింది ఇదీ.. ప్రత్యక్ష సాక్షి కథనం..
Attack on Trump: ట్రంప్ ప్రసంగం ముగిసిన ఐదు నిమిషాల తర్వాత సాయుధుడిని చూశానని ప్రత్యక్ష సాక్షి స్మిత్ చెప్పాడు. అతను రైఫిల్‌తో భవనం పైకప్పుపై నిలబడి ఉన్నాడు. ఈ భవనం రాలీ (బంటర్ కౌంటీ) నుండి కొంచెం దూరంలో ఉంది. గన్ మ్యాన్ గురించి పుసిల్ కు చెప్పానని స్మిత్ చెప్పాడు. విషయం చెప్పిన తరువాతగా కూడా ట్రంప్‌ని వేదికపై నుండి ఎందుకు కిందికి తీసుకురాలేదని తాను  మనస్సులో ఆలోచించినట్లు తెలిపాడు. అయితే, పైకప్పు వాలు కారణంగా వారు బహుశా సాయుధుడిని చూడలేకపోయి ఉండవచ్చని అనుకున్నానని వెల్లడించాడు. ఈలోపు ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆయన ముఖం, చెవులపై రక్తం ఉంది.

రెప్పపాటులో దుండగుడు హతం..
Attack on Trump: కాల్పులు జరిగిన వెంటనే రెప్పపాటు కాలంలోనే సీక్రెట్ సర్వీస్ ఆ సాయుధుడిని హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షి స్మిత్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై స్మిత్ ప్రశ్నలు లేవనెత్తాడు. ర్యాలీ జరుగుతున్న అన్ని పైకప్పులపై రహస్య సేవ ఎందుకు లేదు? ఇది భద్రతా వ్యవస్థ వైఫల్యం అని ఆ ప్రత్యక్షసాక్షి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Also Read: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై కాల్పులు.. !

అసలేం జరిగింది..
కాల్పుల ఘటన నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆయనపై కాల్పులు జరిగాయి. దాడి చేసిన వ్యక్తి 100 మీటర్ల దూరం నుండి మాజీ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నాడు. బుల్లెట్ ట్రంప్ చెవిలో పడింది. ముఖం, చెవుల్లో రక్తం కనిపించింది. ఈ సంచలన కాల్పులు అమెరికాలో కలకలం సృష్టించాయి.

సీక్రెట్ సర్వీస్ వెంటనే దాడి చేసిన వారిని హతమార్చింది. ట్రంప్‌పై దాడి చేసిన షూటర్లిద్దరూ వెంటనే హతమైనట్లు సీక్రెట్ సర్వీస్ తెలిపింది. షూటర్ AR-15 తరహా రైఫిల్‌ని ఉపయోగించాడు. ఘటనా స్థలం నుంచి ఈ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి నుండి AR-15 తరహా రైఫిల్‌ను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కనుగొన్నారు. వాస్తవానికి, ట్రంప్‌పై దాడిలో ఇద్దరు  మంది షూటర్లు పాల్గొన్నారు. ఒక షూటర్ ట్రంప్ వేదిక సమీపంలో గుంపులో ఉండగా, మరొక షూటర్ మృతదేహం భవనం సమీపంలో కనుగొనబడింది. సీక్రెట్ సర్వీస్ కాల్పులు జరిపిన ఇద్దరినీ అక్కడికక్కడే చంపింది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన ముష్కరులను గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని 20 ఏళ్ల యువకుడిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) గుర్తించింది. అతను పెన్సిల్వేనియా నివాసి.

Advertisment
తాజా కథనాలు