AP: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..! కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న. By Jyoshna Sappogula 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Kakinada: కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. అలర్ట్ అయిన సిబ్బంది రోగులను మరో రూమ్ లోకి మార్చారు. అయితే, ఆసుపత్రిలో బాత్రూంకు వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రోగులు. మహిళలకు, పురుషులకు కేవలం ఒకటే బాత్రూం ఉన్న పరిస్థితి అని వాపోయారు. RTVతో ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న మాట్లాడుతూ.. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు. ఈ ఘటనలో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. గత ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా రూ.10కోట్లు గ్రాంట్స్ విడుదల చేశారని..వాటి ద్వారా ఆసుపత్రి పైకప్పులకు మరమ్మత్తులు చేయాలని అన్నారు. Also Read: ఢిల్లీలో జగన్ కు ఊహించని మద్దతు.. ఇండియా కూటమిలోకి వైసీపీ? #ap-news #kakinada #tuni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి