వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

వివేకా హత్య కేసులో ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 30 వరకు రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇప్పటికే బెయిల్‌పై అవినాష్‌రెడ్డి బయట ఉన్న విషయం తెలిసిందే.

New Update
వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

The remand of six accused in the Viveka murder case has been extended

కడప మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితులకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలను కోర్టు జారీ చేసింది. తరుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. ఈ ఆరుగురు నిందితుల్లో సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలు ఉన్నారు.

వీరి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని ఈరోజు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. తెలంగాణ కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు