హార్థిక్ బదులు సూర్యాను అందుకే తీసుకున్నాం..గంభీర్!

టీమిండియాకు కోచ్ బాధ్యతలు చేపట్టిన గంభీర్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కూడా పాల్గొన్నారు. హార్థిక్ ను తప్పించి సూర్యాకు కెప్టెన్ అప్పగించటం పై స్పష్టం చేశారు. ఫిట్ నెస్ కాపాడుకుంటే 2027 వరల్డ్ కప్ కు కోహ్లీ,రోహిత్ ఆడతారని వెల్లడించారు.

New Update
హార్థిక్ బదులు సూర్యాను అందుకే తీసుకున్నాం..గంభీర్!

శ్రీలంక పర్యటనకు ముందు కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఆయనతో పాటు ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్,2023 వరల్డ్ కప్ లో రన్నర్ గా,టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిందని వారు పేర్కొన్నారు. వారి ముందు ఉన్న లక్ష్యాలను విలేకరులతో పంచుకున్నారు.

2024లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత్ రెండో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. దీని తర్వాత అప్పటి వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించగా, టీ20 సిరీస్‌లో భారత జట్టు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రకటించారు. హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ కూడా దక్కలేదు. ఆ స్థానాన్ని శుభమన్ గిల్‌ కు అప్పజేప్పారు.

దీని తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను భారత జట్టు కెప్టెన్‌గా ఎందుకు నియమించారో గంభీర్,అగార్కర్ వివరణ ఇచ్చారు. అజిత్ అగార్కర్ బదులిస్తూ, "భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండగల ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. అందుకే అతన్ని కెప్టెన్‌గా నియమించాము. అతను టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్.అంతేకాకుండా కెప్టెన్‌గా ఉండే అర్హత కూడా ఉంది. హార్థిక్ అన్ని సిరీస్ లలో పాల్గొనలేక పోవచ్చని మేము భావించాము.అంతేకాకుండా హార్థిక్ ఫిట నెస్ మీద కూడా ప్రభావం చూపించవచ్చని తెలిపారు.2026 టీ20 వరల్డ్ కప్ కోసం మేము సూర్యాను ఎంపిక చేసుకున్నామని వారు బదులిచ్చారు.

హార్థిక్ పాండ్యా భారత జట్టుకు చాలా కీలకమని జట్టులో తన పాత్ర పోషిస్తాడని వారు తెలిపారు.అంతేకాకుండా సీనియర్లు విరాట్ కోహ్లీ,రోహీత్ శర్మ,జడేజా ఇప్పటికీ ఫిట్ గా ఉన్నారు.రానున్న 2027 వరల్డ్ కప్ వరకు వారు ఫిట్ గా ఉంటే జట్టులో కొనసాగుతారని వారు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు