Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో జావలిన్ త్రో లో గోల్డ్ మెడల్ కోసమా నీరజ్ చోప్రా తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ అతను తన టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. ఆగస్టు 8వ తేదీ రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రో రికార్డుతో నీరజ్‌ను స్వర్ణం గెలుచుకోకుండా అడ్డుకున్నాడు. టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ ఛాంపియన్ గా నిలవడం కోసం చాలా ప్రయత్నించాడు. అయినా అతను 89.45 మీటర్లు మాత్రమే విసిరాడు. దీంతో మళ్లీ ఛాంపియన్ కావాలన్న కల చెదిరిపోయి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అయితే నీరజ్ చోప్రా తన ప్రత్యర్థి అర్షద్ నదీమ్‌పై ఓటమి చెందడానికి వెనుక గల కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. గజ్జల్లో గాయంతో మ్యాచ్‌లో పాల్గొన్నాననీ.. ఇప్పుడు తనకు శస్త్ర చికిత్స చేయాల్సి రావచ్చని వెల్లడించాడు. దీంతో గాయం కారణంగాణానే నీరజ్ మరోసారి గోల్డ్ మెడల్ కొట్టే ఛాన్స్ కోల్పోయాడని అర్ధం అవుతోంది.
ఆటకు దూరంగా..
Neeraj Chopra: అర్షద్ నదీమ్‌పై ఓటమికి నీరజ్ చోప్రా గాయమే ప్రధాన కారణం అని చెబుతున్నారు. దీనివలన ఫైనల్‌లో ఆడేటప్పుడు నీరజ్ ఫామ్‌లో కనిపించలేదు. నీరజ్ నాలుగు సార్లు ఫౌల్ చేశాడు. కాగా, అర్షద్ నదీమ్ రెండో త్రోను 92.97 మీటర్ల దూరంలో విసిరి మానసిక ధృడత్వాన్ని పొందాడు. మరోవైపు నీరజ్ ఒత్తిడికి గురయ్యాడు. అయితే, నీరజ్ చోప్రా తన గాయాన్ని దేశ ప్రతిష్ట కోసం దాచిపెట్టాడు. బాధపెడుతున్న గాయంతోనే పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌తో పోటీ పడటానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ అతనిని ఓడించడంలో విఫలమయ్యాడు.
మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు శస్త్ర చికిత్స అవసరమయ్యే అవకాశం ఉన్నందున త్వరలో వైద్యుడి వద్దకు వెళతానని వెల్లడించాడు. అంటే సర్జరీ విషయానికి వస్తే మైదానానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కొంతకాలం పాటు అతను ఏ టోర్నీలోనూ పాల్గొనలేడు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కూడా, గాయం పెరుగుతుందనే భయంతో అతను కొన్ని టోర్నమెంట్‌లకు దూరమయ్యాడు. తాను గేమ్ లో కొన్ని తప్పులు చేశాననీ, , అయితే గాయం కారణంగా వాటిని సరిదిద్దుకోలేకపోయానని చెప్పాడు.
నీరజ్ తల్లి కూడా..
Neeraj Chopra: నీరజ్ చోప్రా రజత పతకం గెలిచిన తర్వాత, అతని తల్లి కూడా అతను గాయంతో ఆడుతున్నట్లు వెల్లడించింది. తనకు వెండి పథకం అయినా బంగారంతో సమానమని ఆమె చెప్పారు. నీరజ్ సాధించిన ఈ విజయంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుపొందడం గురించి ఆమె అభిప్రాయం అడిగినప్పుడు, "పర్వాలేదు, అతను కూడా మా బిడ్డ." అని చెప్పారు. దీంతో అందరి మనసులు గెలుచుకున్నారు.
Also Read : భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు