Crime News: రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని దారుణంగా మోసం చేసిన ముఠా.. రూ. 5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పి.!

మిర్యాలగూడలో అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. సమీర్‌ అనే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారికి రూ.5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పిన ముఠా తన దగ్గర రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు.

New Update
Electricity KYC Scam: ఎలక్ట్రిసిటీ కేవైసీ అప్‌డేట్ స్కామ్! మీ విషయంలో కూడా ఇలా జరిగిందా?

Nalgonda: ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారికి రూ. 5కోట్లు అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఈ కేసుపై వివరాలు వెల్లడించారు.

Also Read: దయచేసి నా పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టొద్దు.. మృతి చెందిన రైతు అభ్యర్థన.!

అప్పుగా రూ. 5 కోట్లు..

హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌సమీర్‌ అనే వ్యక్తి నిజామాబాద్‌ లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే, కొత్త వెంచర్‌కు డబ్బు కోసం శ్రీకాంత్‌ అనే మధ్యవర్తి ద్వారా మిర్యాలగూడకు చెందిన కండెల గణేష్‌, కండెల మల్లికార్జున్‌ అనే వ్యక్తులను సంప్రదించాడు. సమీర్‌కు అప్పుగా రూ. 5 కోట్లు ఇవ్వడానికి వారు అంగీకరించి గత నెల 31న రూ.90 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు సమీర్‌ నుంచి ఇంటి పత్రాలు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్‌ చెక్కులు అన్నీ తీసుకున్నారు.

60 లక్షలు వడ్డీ..

ఆ తరువాత మిగతా డబ్బు కావాలంటే తాము ఇచ్చిన రూ. 90 లక్షలతోపాటు అప్పు ఇవ్వబోయే రూ. 5 కోట్లకు వడ్డీగా మొత్తం రూ. 60 లక్షలు ముందుగా ఇవ్వాలన్నారు. ఈ నెల 5వ తేదీన డబ్బు తీసుకుని మిర్యాలగూడకు రావాలని చెప్పారు. ఈ క్రమంలో వారు చెప్పినట్లుగానే డబ్బును తీసుకుని తనతో పాటు మరో ఇరువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను సమీర్ తన వెంట తీసుకుని వెళ్లాడు. గణేష్‌, మల్లికార్జున్‌లు ఇంతకు ముందు ఇచ్చిన రూ. 90 లక్షలు సమీర్ నుంచి తీసుకుని చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి డాక్యుమెంట్లు సమీర్‌కు తిరిగి ఇచ్చేశారు.

Also Read: గురుకుల స్కూల్‌లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది?

దాడి చేసి పరార్..

అనంతరం సమీర్‌ రూ.5 కోట్ల అప్పు గురించి వారిని అడగ్గా.. ముందు వడ్డీ డబ్బులు తెచ్చారా అని వారు ప్రశ్నించారు. దీంతో సమీర్‌ తన బ్యాగ్ ను తెరచి రూ. 60 లక్షలను చూపించబోయాడు. దీంతో గణేష్‌, మల్లికార్జున్‌ స్నేహితులు.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సమీర్‌ అతడి స్నేహితులపై దాడి చేసి డబ్బు ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. జరిగిన మోసాన్ని గ్రహించిన సమీర్‌ అతడి స్నేహితులు నిందితులను వెంబడించే ప్రయత్నం చేయగా, వారిపై దాడి చేసి పారిపోయారు.

24 గంటల్లోనే..

ఈ మోసంపై సమీర్‌ అదేరోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితుల్లో కొందరిని పట్టుకుని వారి నుంచి రూ.60 లక్షల నగదు, స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగితా నిందితులు పరారీలో వెల్లడించారు. 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించడంతో డీఎస్పీ, సీఐలను ఎస్పీ అభినందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు