Parliament Security: పార్లమెంట్ లోపలి వెళ్లాలంటే ఎంత సెక్యూరిటీ దాటాలో తెలుసా? 

పార్లమెంట్ లో దాడి.. అని తెలిసిన వెంటనే దేశం మొత్తం నివ్వెరపోయింది. పార్లమెంటులో అనేక భద్రతా అంచెలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ, ఫేస్ రికగ్నిషన్, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఇన్నిటి మధ్య జరిగిన ఈ ఘటన పార్లమెంటు భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. 

New Update
Parliament Security: పార్లమెంట్ లోపలి వెళ్లాలంటే ఎంత సెక్యూరిటీ దాటాలో తెలుసా? 

Parliament Security: కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనం.. పాత భవనంలో రెండు దశాబ్దాల క్రితం జరిగినట్టే దాడికి గురైంది. అక్కడ ఎవరికీ ఏమీ కాకపోయినా.. దాడికి కారణాలు తెలియకపోయినా.. దాడి చేసిన వారు అందరూ పట్టుబడినా.. దేశప్రజలందరినీ చాలా అనుమానాలు తికమక పెట్టేస్తున్నాయి. . సినిమా చూడాలని వెళితేనే.. అంతెందుకు మెట్రో ట్రైన్ ఎక్కాలంటేనే బ్యాగులతో సహా మన ఒళ్ళంతా సెక్యూరిటీకి అప్పచెప్పేయాలి కదా.. అలాంటిది దేశ ప్రజలందరి మనోభావాలను రిప్రజెంట్ చేసే పార్లమెంట్ దగ్గర అటువంటి చెకింగ్ ఎందుకు జరగలేదు? అసలు అక్కడ చెకింగ్ జరుగుతుందా? పాస్ చూపించేస్తే సెల్యూట్ కొట్టి పార్లమెంట్ లోకి పంపించేస్తారా? దేశ ప్రధాని దగ్గర నుంచి ఎంపీల వరకూ అతి ముఖ్యమైన నాయకులు అందరూ ఉండే ప్రాంతంలో అంత సులభంగా ఓ ఆరుగురు వ్యక్తులు వచ్చి.. అందులో ఇద్దరు భవనంలోకి చేరి.. అక్కడ నుంచి వీఐపీల మధ్యలో దూకి పొగపెట్టేశారంటే.. అది నిందితుల తెలివితేటలా లేకపోతే భద్రతా వైఫల్యమా? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే అసలు పార్లమెంట్ భద్రతా వ్యవస్థ (Parliament Security0ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. 

కొత్త పార్లమెంట్ భవనాన్ని 28 మే 2023న ప్రారంభించారు. మీడియా నివేదికల ప్రకారం, కొత్త పార్లమెంట్ భవనంలో అధునాతన CCTV కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్, సెక్యూరిటీ ఆపరేటింగ్ సెంటర్, అధునాతన సాంకేతికత, ఆధునిక ఆయుధాలతో కూడిన భద్రతా దళాలు, ఉన్నత స్థాయి అగ్నిమాపక వ్యవస్థ ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ సమయంలో పార్లమెంట్ భద్రతా అధికారుల బృందం పలు దేశాలను కూడా సందర్శించింది. ఏదైనా ఉగ్రవాద దాడి లేదా సైబర్ దాడిని ఎదుర్కోవడానికి ఏ వ్యవస్థ మంచిదో తెలుసుకోవడం జరిగింది. వీటన్నింటిని ప్రాతిపదికగా తీసుకుని పార్లమెంట్ భద్రతా(Parliament Security) ప్రణాళికను రూపొందించారు. పార్లమెంట్ భద్రత కోసం పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (పీడీజీ) సిబ్బందిని నియమించారు.

థర్మల్ ఇమేజింగ్, 360 డిగ్రీ రొటేట్ CCTV - ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్.. 

కొత్త పార్లమెంట్ భవనంలో థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ఉందని, ఇది పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి ఎలాంటి చొరబాట్లను సులభంగా గుర్తించగలదని కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి.  పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను పర్యవేక్షించడానికి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన అధునాతన CCTV కెమెరాలు ఉన్నాయి, ఇవి 360 డిగ్రీలు తిరుగుతాయి.  ప్రతి కదలికపై నిఘా ఉంచుతాయి. పార్లమెంట్‌కు రక్షణగా ఉండే భద్రతకు ఆధునిక ఆయుధాలు, పరికరాలు ఉన్నాయి. సైబర్ దాడులను నివారించడానికి, కొత్త పార్లమెంట్ హౌస్‌లో సైబర్ భద్రత కోసం రెండు ప్రత్యేక భద్రతా ఆపరేటింగ్ సెంటర్‌లను సృష్టించనున్నట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అనుమానాస్పద వ్యక్తిని నిలువరించడానికి కొత్త I కార్డ్‌ల నుంచి  అనేక స్థాయి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. వీటిలో అడ్డంకులు - చెక్‌పాయింట్‌ల వద్ద ఆధునిక ఆయుధాలు,  పరికరాలతో కూడిన భద్రతా దళాలు ఉన్నాయి.

Also Read: దాడి వెనుక ఉన్నది నలుగురు కాదు.. ఆరుగురు..! మరో ఇద్దరు ఎవరంటే?

పార్లమెంటులో 1272 మంది కంటే ఎక్కువ మంది ఎంపీలు కలిసి కూర్చోవచ్చు..

పాత పార్లమెంటు ఆకారం గుండ్రంగా ఉంటుంది, అయితే కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో రూపొందించారు.  పాత  లోక్‌సభ సిట్టింగ్‌ సామర్థ్యం 590 మంది. కొత్త లోక్‌సభలో 888 సీట్లు ఉన్నాయి.  ఇక్కడి సందర్శకుల గ్యాలరీలో 336 మందికి పైగా కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి. కొత్త రాజ్యసభలో 384 సీట్లు ఉన్నాయి.  సందర్శకుల గ్యాలరీలో 336 మందికి పైగా కూర్చోవచ్చు. లోక్‌సభలో చాలా స్థలం ఉంది, ఉభయ సభల సంయుక్త సమావేశంలో, 1272 కంటే ఎక్కువ మంది ఎంపీలు లోక్‌సభలోనే కూర్చోవచ్చు. పార్లమెంట్‌లోని ప్రతి ముఖ్యమైన పనికి ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. అధికారులు, ఉద్యోగుల కోసం హైటెక్ కార్యాలయ సౌకర్యం కూడా ఉంది. కేఫ్ - డైనింగ్ ఏరియా ల్లో కూడా హైటెక్ రక్షణ(Parliament Security)  పరికరాలు అమర్చారు.

ఇన్ని ఉన్నా కూడా పార్లమెంట్ లో జరగకూడనిది జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఎలా జరిగింది.. ఇటువంటివి పునరావృతం కాకుండా ఏమిచేయాలి అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈరోజు పార్లమెంట్ మొత్తం భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు