Auto Drivers : మా బతుకులు ఆగం చేయోద్దు.. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి! కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే రద్దు చేయాలని నిర్మల్ జిల్లా ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ పథకం వల్ల తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. By Bhavana 13 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mahalakshmi Scheme : తెలంగాణ (Telangana) లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ఆచరణలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. చెప్పినట్లుగానే మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) లో భాగంగా ఉచిత బస్సు(Free Bus Journey) ప్రయాణాన్ని డిసెంబర్ 9 నుంచి అమలు చేసింది. డిసెంబర్ 9 నుంచి నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ..పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్ల్ నిర్మల్ జిల్లా ముధోల్ లో చౌరస్తా వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. Your browser does not support the video tag. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి వాహనాలు కొని ఈఎంఐలు కట్టుకుంటూ ఆటోలు నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటే ఒక్కసారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంతో తమ పొట్టకొట్టారని ఆరోపించారు. వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ఎత్తివేసి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో మహిళలకు పలు బస్ సర్వీసుల ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో స్టూడెంట్స్ , మహిళలు ప్రైవేట్ వాహనాల్లో తిరగడం దాదాపుగా తగ్గింది. ఉచిత బస్సు ప్రయాణం తమ ఆదాయానికి గండి కొట్టిందని దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఇది ప్రభుత్వం గుర్తించాలన్నారు. Also read: ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త! #telangana #autodriver #mahalakshmi-scheme #free-bus-journey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి