Alert : దేశంలోని నిరుద్యోగులకు అలర్ట్ చేసింది కేంద్రం. ఈ మధ్య కాలంలో రైల్వే శాఖలో భారీగా కొలువులు అంటూ నోటిఫికేషన్లు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్రం... తాజాగా రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటనపై స్పందించింది. ఆ ఉద్యోగ ప్రకటన ఫేక్ అని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుందంటూ ఓ ప్రకటన జోరుగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్టును పెట్టింది.
ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటీసును ఏదీ కూడా రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ఎప్పుడు వ్యక్తిగత, ఆర్ధికపరమైన సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది. ఆర్ పీఎఫ్ లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య, వేతనం, వయో పరిమితి, విద్యా అర్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుము వంటి అంశాలతో కూడిని ఈ ఫేక్ యాడ్ ను ఎవరూ నమ్మకూడదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో కొనసాగుతోన్న ఐపీఎస్ ల బదిలీలు..తాజాగా మరో ముగ్గురు బదిలీ.!