Tollywood : ఘనంగా తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్!

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రాబోతున్న కొత్త సినిమా తెప్ప సముద్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రయూనిట్ నిర్వహించారు.

Tollywood : ఘనంగా తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్!
New Update

Theppa Samudram : బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి(Arjun Ambati) హీరోగా, కిశోరి దాత్రక్(Kishori Dhatrak) హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌(Hyderabad Prasad Labs) లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సోమచ్. ‘తెప్పసముద్రం’ చిన్న చిత్రమని చెప్పలేం. ఇదొక మంచి చిత్రం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..‘‘ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు చైతన్య గారు నన్ను నిర్మాతకు పరిచయం చేశారు. ఒక నెల రోజుల్లో టీమ్ సెట్ అయింది. ప్రతి ఒక్క టెక్నీషియన్ అద్భుతంగా పని చేశారు. తెప్పసముద్రంలో చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ ఉన్న సినిమాను మీడియా ఎప్పుడూ ఆదరిస్తుంది. అలాగే ఈ సినిమాను కూడా జనాల వద్దకు తీసుకెళ్లాలని కోరుతున్నా.’’ అని అన్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. చిన్న సినిమా అనగానే కాస్ట్ అండ్ క్రూ వచ్చామా.. పని చేశామా.. డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లు ఉంటారు. కానీ డైరెక్టర్, నిర్మాతకు తడిసి మోపెడవుతుంది. సినిమా రిలీజ్ వరకూ వాళ్లు చాలా వేదన పడుతుంటారు. మా నాన్న, పెద్దనాన్ని డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఆ వేదన నాకు తెలుసు. ఇలాంటి డైరెక్టర్, నిర్మాతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. వీళ్లకు తెలిసింది సినిమా ఒక్కటే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా. ఈ సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 19న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని చెప్పారు.

Also Read : హాస్యానికి కేరాఫ్ ఎడ్రస్.. ది వన్ అండ్ ఓన్లీ కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్!

#tollywood #tollywood-news #kishori-dhatrak #arjun-ambati #theppa-samudram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe