Pawan Kumar Chamling: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Election Result) సంచలనం జరిగింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) ఊహించని రీతిలో ఓటమి మూటగట్టుకుంది. 2019 వరకు 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీ.. 2024 ఎన్నికల్లో 32 స్థానాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమై ఘోర పరాభవం చెందింది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోగా.. పార్టీ అధినేత, దేశంలోనే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ (Pawan Kumar Chamling) పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. 1985 నుంచి వరుసగా 8సార్లు ఎమ్మెల్యేగా, 1994- 2019 వరకు 5సార్లు సీఎంగా పనిచేసిన పవన్ చామ్లింగ్ తొలిసారి ఓటమి చవిచూశారు.
ఇది కూడా చదవండి: TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి
అలాగే ఈ ఎన్నికల్లో పాక్లోక్ కామ్రాంగ్, నామ్చేబంగ్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా.. పాక్లోక్ కామ్రాంగ్‌లో ఎస్‌కేఎం అభ్యర్థి భోజ్‌రాజ్ రాయ్ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో, నామ్చేబంగ్‌లోనూ అదే పార్టీకి చెందిన రాజుబసంత్ చేతిలో 2256 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిక్కిం శాసనసభలో చామ్లింగ్ అడుగు పెట్టకపోవడం 39 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) ప్రభంజనం సృష్టించి ఏకంగా 31 సీట్లు గెలుచుకుంది. 2019లో ఎస్‌కేఎంకు 17 సీట్లు రాగా ఈసారి మరో 14 స్థానాల్లోనూ గెలుపొందింది.