The Most Expensive Weddings : కోట్లు దాటిన పెళ్లిళ్లు.... గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఖర్చు ఎంతంటే..?

పెళ్లి కోసం కొంతమంది భారీ గా ఖర్చు చేస్తుండగా... మరికొందరు మాత్రం సాదాసీదాగా జరుపుకుంటారు. అయితే మనదేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిళ్ల గురించి, వాటికి అయిన ఖర్చుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.

New Update
The Most Expensive Weddings : కోట్లు దాటిన పెళ్లిళ్లు.... గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఖర్చు ఎంతంటే..?

Gali Janardhan Reddy : భారతీయ వివాహ సంప్రదాయాలు ప్రాంతం, మతం, సమాజం, వధూవరుల వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా విభిన్నంగా ఉంటాయి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని వేడుక. దీన్ని ప్రతి ఒక్కరూ ఒక పండుగలా జరుపుకుంటారు. సాధారణంగా వధువు, వరుడు అలంకరణలు, వేషధారణ, సంగీతం, నృత్యం, ఆచారాలు, దుస్తులతో వివాహం వేడుకగా జరుగాలని ఆశిస్తారు. అయితే వారి శక్తికి తగ్గట్లు పెళ్లి వేడుకను నిర్వహిస్తూ ఉంటారు.పెళ్లి కోసం కొంతమంది భారీ గా ఖర్చు చేస్తుండగా... మరికొందరు మాత్రం సాదాసీదాగా జరుపుకుంటారు. అయితే మనదేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిళ్ల గురించి, వాటికి అయిన ఖర్చుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్, డయానాలది. ఈ పెళ్లి కోసం ఏకంగా 110 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇక మనదేశంలో చెప్పుకోదగిన పెళ్లిళ్లలో మొదటిది రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబాని కూతురు పెళ్లి.

ఈషా అంబానీ-ఆనంద్ పిరమల్

భారత్ లో అత్యంత ధనవంతుడు ఎవరంటే అందరికీ గుర్తొచ్చేది రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. ఆయన గారాల పట్టి ఈషా అంబానీ పెళ్లి కి ఎంత ఖర్చయిందో తెలిస్తే నోరువెళ్లబెట్టకుండా ఉండలేరు. ముఖేష్ అంబానీ గారాలపట్టి ఈషా అంబానీ, ప్రముఖ బిజినెస్ ‌మెన్ అజయ్ పిరమల్ తనయుడు ఆనంద్ పిరమల్‌తో జరిగింది. 2018లో జరిగిన ఈ వివాహం వ్యయం ఎంతో తెలుసా? అక్షరాల రూ. 742కోట్లు. ఈ వెడ్డింగ్ ఫంక్షన్స్ ఇటలీ, ఉదయ్‌పూర్, ముంబై తదితర మూడు ప్రదేశాల్లో జరిగాయి. ముంబైలోని ముఖేశ్ నివాసం యాంటీలియాలో ఈషా-ఆనంద్ పిరమల్‌ వివాహాం జరిగింది. ఇందుకోసం 27 అంతస్తుల ఈ భవంతిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహానికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలను చేపట్టారు.  అతిథులకు భోజనాలు మొదలు అన్ని కూడా ఖరీదైనవే.

బ్రాహ్మణీ- రాజీవ్ రెడ్డి

ఇక చెప్పుకోవలసింది గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy) కూతురు బ్రాహ్మణీ పెళ్లి. కర్ణాటక(Karnataka) కు చెందిన మాజీ మంత్రి, జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహానికి 500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. తద్వారా భారతదేశం(India) లోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది. జనార్దనరెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం 2016 నవంబర్ 6న జరిగింది. బ్రాహ్మణీకి హైదరాబాదీ(Hyderabad) వ్యాపారవేత్త విక్రమ్ దేవ్ రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి(Rajiv Reddy) తో వివాహం జరిగింది. ఈ రాయల్ వెడ్డింగ్ ఈవెంట్ ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ వేడుకకు సుమారు 50,000 మంది అతిథులు హాజరయ్యారు. అతిథులు బస చేసేందుకు బెంగళూరులోని ఫైవ్, త్రీ స్టార్ హోటళ్లలో 1500 గదులు బుక్ చేసుకున్నాడు.

Also Read : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు!

బ్రాహ్మణీ రెడ్డి(Brahmani Reddy) పెళ్లి దుస్తులు కూడా చాలా ఖరీదైనవి. బ్రాహ్మణి తన పెళ్లిలో ఎరుపు రంగు కంజీవరం చీరను ధరించింది. దీని ధర రూ. 17 మిలియన్లు. చీరను బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ చేసి, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేశారు. తన పెళ్లిలో, బ్రాహ్మణి రూ. 25 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. మెడలో, తలలో వజ్రాభరణాలు కూడా ధరించింది. బ్రాహ్మణీ వివాహ అలంకరణల మొత్తం ఖర్చు రూ.90 కోట్లు. అదనంగా, వధువు మేకప్ కోసం రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

పెళ్లికి వచ్చిన అతిథులను జనార్ధన్ రెడ్డి ఎంతో గౌరవంగా చూసుకున్నారు. హాలు చుట్టూ అతిథులను తరలించడానికి 40 రాయల్ ఎడ్లబండ్లను ఉపయోగించారు. అదే సమయంలో, అతిథులను రవాణా చేయడానికి 2,000 టాక్సీలు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. జనార్ధన్ రెడ్డి తన కూతురి పెళ్లికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా 16 రకాల రుచికరమైన స్వీట్స్ తో ప్రత్యేక రాజభోజనం చేశారు. ఒక్కో భోజనం విలువ రూ.3,000గా చెబుతారు. ఇక కుమారుడి వివాహం కోసం జనార్ధన్ రెడ్డి ఏకంగా రూ. 549కోట్లు ఖర్చు చేశారని చెబుతారు.

ఇదే తరహాలో  సహారా చీఫ్ సుబ్ర తో రాయ్ కుమారులు సుషాంతో రాయ్, సీమంతో రాయ్‌ల పెళ్లికి కూడా భారీ గానే వెచ్చించారు. 2004లో జరిగిన ఈ ఇద్దరు బ్రదర్స్ పెళ్లికి ఏకంగా రూ. 556 కోట్లు ఖర్చు చేశారు.

గుల్రాజ్ బెహల్-శ్రీస్తి మిట్టల్

స్టీల్ కింగ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మేనకోడలు శ్రీస్తిని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన గుల్రాజ్ బెహల్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. 2013లో స్పెయిన్‌లో జరిగిన ఈ వివాహానికి అక్షరాల రూ. 519కోట్లు వెచ్చించారు.

వనీషా మిట్టల్-అమిత్ భాటీయా

ఇది మిట్టల్ ఫ్యామిలీలోనే జరిగిన రెండో భారీ వివాహా మహోత్సవం. లక్ష్మీ నివాస్ మిట్టల్ కూతురు వనీషా మిట్టల్‌ పెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన అమిత్ భాటీయాతో జరిగింది. దీనికి అయిన ఖర్చు రూ.400కోట్లు.

లలిత్ తన్వర్-యోగిత జౌన్పూరియా

ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కన్వర్ తవార్ కుమారుడు లలిత్ తన్వర్ వివాహం 2011లో యోగిత జౌన్పూరియాతో జరిగింది. ఈ పెళ్లి వ్యయం రూ.250కోట్లు.

అదిల్ షాజన్-సనా ఖాన్

డైరెక్టర్ అదిల్ షాజన్ ఓ విలాసవంతమైన క్రూయిజ్‌లో సనా ఖాన్‌ను పెళ్లాడారు. దీని కోసం ఆయన ఖర్చు చేసింది అక్షరాల రూ.200కోట్లు.

సంజయ్ హిందూజా-అను మహతి

బ్రిటన్‌‌లోని సంపన్న కుటుంబానికి చెందిన సంజయ్ హిందూజా.. డిజైనర్ అను మహతిని పరిణయమాడారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఖర్చు వచ్చేసి రూ.140కోట్లు.

Also Read : అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంప్ విడుదల..గర్భగుడిలోకి రాముని విగ్రహం

Advertisment
తాజా కథనాలు