జాతీయజెండా ఎగరేసి స్పృహతప్పి పడిపోయిన మంత్రి

దేశవ్యాప్తంగా నేడు (AUG-15) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఈ వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా దేశంలోని పలు వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం అపశృతి చోటుచేసుకుంది. జాతీయజెండాను ఎగురవేసి ఓ మంత్రి కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
జాతీయజెండా ఎగరేసి స్పృహతప్పి పడిపోయిన మంత్రి

నేడు దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. యావత్ దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయింది. వాడవాడలా, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగిరింది. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి వీధిలోనూ కుల మతాలకతీతంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అపశృతి చోటు చేసుకుంది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి

ఇక అసలు వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లో జెండా ఆవిష్కరించిన తర్వాత వందన స్వీకార సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. ప్రభురామ్ చౌధరి అకస్మాత్తుగా స్పృహతప్పి స్టేజిమీదే కుప్పకూలిపోయాడు. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్బంగా ‘హర్ గర్ తిరంగా అభియాన్’ అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు.

స్పృహతప్పి పడిపోయిన మంత్రి

ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు పోలీసులు, అధికారులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు పంద్రాగస్టు (AUG-15) సందర్బంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఎగురవేసిన తర్వాత గౌరవవందనం స్వీకరించే సమయంలో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయారు.

అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్‌ కూడా

మంత్రి పడిపోయిన వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్‌ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. ప్రస్తుతం ఆయన కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు