Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

కానూరు ఎన్‌ఆర్‌ఐ కాజేజీలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన గురువర్మ (17) కానూరులోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

New Update
Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

Inter Student: కానూరు ఎన్‌ఆర్‌ఐ కాజేజీలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లాకు చెందిన గురువర్మ (17) కానూరులోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం హోం సిక్‌ సెలవులు ఇవ్వడంతో గురు వర్మ ఇంటికి వెళ్లి తిరిగి సోమవారం కాలేజీకి తండ్రితో కలిసి వచ్చాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం కాలేజీ యాజమాన్యం నుంచి తండ్రి వెంకటేశ్వరరాజుకు గురువర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్‌ వచ్చింది.

విద్యార్థి మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సమయంలో లెటర్‌ రాసి చనిపోయినట్లు కాలేజీ యాజమాన్యం చెబుతుంటే..ఆ లెటర్ లో ఉన్న రైటింగ్‌ తమ కుమారుడిది కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Also read: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు!

Advertisment
తాజా కథనాలు