Bjp lady leader murder: మహారాష్ట్ర, నాగ్ పూర్ కు చెందిన బీజేపీ మహిళా నేత సనాఖాన్ మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేధించారు. పది రోజులుగా కనిపించకుండా పోయిన ఆమెను భర్తే దారుణంగా హత మార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆమె భర్త అమిత్ సాహును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. ఇక అతడితో పాటు మరో అనుమానితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన సనాఖాన్.. బీజేపీ మైనార్టీ సెల్ సభ్యురాలు. కాగా, ఆగష్టు ఒకటిన మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఉన్న తన భర్తతో కలవడానికి వెళ్లారు సనాఖాన్. అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. అయితే ఆమె జబల్ పుర్ కు చేరుకున్న తరువాత ఫోన్ చేసి తల్లికి చేరుకున్నాను.. అని చెప్పారు. భర్త అమిత్ సాహును కలిసి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు. ఆ తరువాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక దీన్నే బిగ్ క్లూ గా తీసుకున్న పోలీసులకు..అమిత్ సాహు పై అనుమానం కల్గింది. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయంలో బయటపడింది. అమిత్ సాహు మద్యం అక్రమ రవాణా బిజినెస్ చేస్తుంటాడు. అదే విధంగా అతనికి ఓ దాబా ఉంది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో సనా ఇంకా అమిత్ మధ్య కొన్నాళ్లుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె జబల్ పుర్ వచ్చిన సమయంలో కూడా అదే విషయమై వారిద్దరు గొడవ పడ్డారు. అది కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. ఈ దాడిలో సనా ఇంట్లోనే మరణించింది. తర్వాత ఆమె మృతదేహాన్ని అమిత్ సాహు హిరాన్ నదిలో విసిరేశాడు. దీంతో పోలీసులు ఆమె డెడ్ బాడీ కోసం నదిలో గాలిస్తున్నారు.