Asian Games: ఆఖరి రోజు కూడా ఆగని పతకాల వేట.. భారత్ కు మొత్తం ఎన్ని మెడల్స్ అంటే? ఈసారి జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ తన సత్తాచాటింది. ఏకంగా 107 పతకాలను సాధించి...మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. రానున్న కాలంలో క్రీడల్లో భారతీయులకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడానికి ఈ విజయాలే నిదర్శనం. అందుకే భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం..విజేతలను అభినందించారు. ప్రపంచ దేశాల్లో భారత్ సగర్వంగా నిలిచేలాచేసిన క్రీడాకారులందరిని మోదీ మెచ్చుకున్నారు. By Bhoomi 08 Oct 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆసియా క్రీడలను భారత్ అత్యంత ఘనంగా ముగింపు పలికింది. చివరి రోజు ఏకంగా 12 మెడల్స్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 107 పతకాలు చేరాయి. జెట్ స్పీడ్ భారత్ సెంచరీ కొట్టింది. వీటిలో 28 బంగారు పతకాలు, 2 వెండి, 41 బ్రోంజ్ పతకాలు ఉన్నాయి. చివరి 14వ రోజున పురుషుల కాంపౌండ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో అభిషేక్ వర్మ ఫైలన్స్ తో తన తోటి ఆటగాడిని ఓడించింది వెండి పతకం సాధించాడు. ఈ ఈవెంట్ లో ఓజాస్ డియోటాల్ 149-147తో తన తోటి ఆటగాడిని ఓడించి స్వర్ణం సాధించాడు. ఇక మహిళ వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్ తో అదితి స్వామి 146-140తో ఇండోనేషియాకు చెందిన రాతిహ్ జిల్జాతి ఫ్లడ్లీని ఓడించింది. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్ లో 149-145తో కొరియన్ రిపబ్లిక్ కు చెందిన చైవాన్ సోపై గెలిచిన జ్యోతి వెన్నమ్ గోల్డ్ సాధించింది. అటు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చంద్రశేఖర్ జంట..రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన ప్రత్యర్థిని వరుస సెట్లలో ఓడించి బంగారం పతకం కైవసం చేసుకుంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! మరోవైపు మహిళల చెస్ ఈవెంట్ లో కోనేరు హంపి, వైశాలి రమేశ్ బాబు, వంటికా అగర్వాల్, హారిక ద్రోణవల్లి టోటల్ ర్యాకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచారు. అటు పురుషుల చెస్ ఈవెంట్‌లో ఆర్ ప్రజ్ఞానానంద, డి గుకేశ్, అర్జున్ కుమార్ ఎరిగైసి, హరికృష్ణ పెంటాల, విదిత్ సంతోష్‌ల జట్టు రజతాన్ని గెలిచారు. పురుషుల క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టు బ్యాటింగ్ చేయలేకపోయినా స్వర్ణం గెలిచింది, చివరికి మ్యాచ్ రద్దు అవ్వడంతో, ర్యాంకింగ్స్‌లో భారత్‌కు పతకం వచ్చింది. మహిళల కబడ్డీలో భారత్ 26-25 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించి బంగారు పతకం గెలిచింది. పురుషుల కబడ్డీలో భారత్ 33-29తో ఇరాన్‌ను ఓడించి పలు వివాదాలతో స్వర్ణం సాధించింది. మహిళల హాకీలో భారత్ 2-1తో జపాన్‌ను ఓడించి కాంస్యాన్ని దక్కించుకుంది. పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో దీపక్ పునియా 11-0తో ఇండోనేషియాకు చెందిన రాండా రియాండెస్టాపై విజయం సాధించి బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఒళ్లు గగుర్పొడిచేలా వార్ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..! #narendra-modi #asian-games #asian-games-last-day #12-medals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి